బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 17, 2020 , 04:02:12

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
  • అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలి
  • డీజీపీ మహేందర్‌రెడ్డి
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గోదావరి తీరంలో ఏరియల్‌ వ్యూ
  • ఎన్టీపీసీలో పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష
  • కమిషనరేట్‌ పనితీరు బాగుందని కితాబు
  • రాత్రి ఎన్టీపీసీ గెస్ట్‌ హౌస్‌లోనే బస

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ / జ్యోతినగర్‌ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా, పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో సోమవారం పర్యటించిన ఆయన, సాయంత్రం ఎన్టీపీసీకి చేరుకున్నారు. అంతకుముందు పెద్దప ల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా ల సరిహద్దు అటవీప్రాంతాలు, గోదావరితీరాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను హెలీక్యాప్టర్‌ నుంచి వీక్షించారు. ఎన్టీపీసీకి చేరుకున్న డీజీపీకి రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనీయం హాల్‌లో రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి, మం చిర్యాల జిల్లాల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి  తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ల వారీగా అధికారుల పని తీరును సమీక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అభినందించారు. గోదావరి పరివాహక ప్రాంతాల సమీపంలో నక్సల్స్‌ కదలికలు, ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలను సమీక్షించారు. సమావేశం అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని జ్యోతిక భవన్‌ గెస్ట్‌హౌస్‌లో డీజీపీ బస చేశారు. ఇక్కడ నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి, అడిషనల్‌ గ్రే హౌండ్స్‌ డీజీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌బీఐ ఐజీ ప్రభాకర్‌ రావు, మంచిర్యాల డీసీపీ ఉయ్‌కుమార్‌రెడ్డి,  పెద్దపల్లి డీసీపీ పీ రవీందర్‌, అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ఆర్డర్‌ రవికుమార్‌, అడిషనల్‌ డీసీసీ అడ్మిన్‌  అశోక్‌కుమార్‌,  పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.


logo
>>>>>>