శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 17, 2020 , 03:55:18

ఇక డబుల్‌ స్పీడ్‌

ఇక డబుల్‌ స్పీడ్‌
  • పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర సర్కారు వడివడిగా అడుగులు
  • తాజా బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు
  • ఉమ్మడి జిల్లాకు రూ. వేయి కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలు
  • కొత్తగా సొంత స్థలంలో కట్టుకునే వారికీ ఆర్థిక సాయం
  • మరింత పుంజుకోనున్న వేగం
  • ఇప్పటికే జిల్లాలో జోరుగా ఇండ్ల నిర్మాణాలు
  • మంథని, కాల్వశ్రీరాంపూర్‌లో గృహప్రవేశాలకు సిద్ధం
  • పెద్దపల్లి మండలం హన్మంతుని పేటలో తుదిమెరుగులు
  • పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షాతిరేకాలు

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే వేల సంఖ్యలో ‘డబుల్‌ బెడ్రూం ఇండ్ల’ నిర్మాణాలు కొనసాగుతుండగా, తాజా బడ్జెట్‌లో గృహాల కోసం భారీగా 11,917 కోట్లను కేటాయించింది. ఇక ముందు నిర్మాణాలు మరింత వేగవంతంకానుండగా, తాజా బడ్జెట్‌ ప్రతిపాదనలను చూస్తే ఉమ్మడి జిల్లాకు సుమారు వేయి కోట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో మంథని పట్టణం,  కాల్వశ్రీరాంపూర్‌లో ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల జెట్‌స్పీడ్‌తో కొనసాగుతున్నాయి. త్వరలోనే పూర్తిచేసి అందజేసేందుకు తీవ్ర కసరత్తు జరుగుతుండగా, పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదల సొంతింటి కలను నిజం చేసి.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. గతంలో కేటాయించిన ఇండ్ల నిర్మాణాలను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణాలకు మరింత ఊపును ఇచ్చేందుకు తా జా బడ్జెట్‌లో భారీగా నిధులను ప్రతిపాదించిం ది. ఇటీవల బడ్జెట్‌లో గృహ నిర్మాణాల కోసం రూ.11,917 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపిం ది. అలాగే సొంత స్థలం ఉన్న వాళ్లు నిర్మాణం చేసుకునేందుకు వీలుగా వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష మందికి చేయూతనివ్వనున్నట్లుగా తాజా బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వం నిర్మాణాలు చేయడమే కాదు.. మరోవైపు.. సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే స్థోమత లేని వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలోకి భిన్నంగా ఈసారి బడ్జెట్‌ అధికంగా కేటాయించడం.. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించిందని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. తాజా బడ్జెట్‌ ప్రకారం చూస్తే.. పూర్వ కరీంనగర్‌ జిల్లాకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయి. 

చక చకా నిర్మాణాలు 

జిల్లాలో ప్రస్తుతం డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. మండలాలు, గ్రామాల పరిధిలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పనులు జెట్‌స్పీడ్‌తో కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 3,316 ఇండ్లు మంజూరు కాగా, ఇందులో 2616 ఇండ్లకు టెండర్లు పిలిచారు. ఆ మేరకు 1669 నిర్మాణాలను ప్రారంభించగా, ఆయా సంస్థలు ఇండ్లను పూర్తి చేస్తున్నాయి. ఇందులో 310 ఇండ్లు పూర్తికాగా, 1359 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 

మంథనిలో 92 ఇండ్ల నిర్మాణం పూర్తి.. 

మంథని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడలో జీప్లస్‌ వన్‌ విధానంలో చేపట్టిన 92 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే ఇండ్ల నిర్మాణ కాంప్లెక్స్‌లో సీసీ రోడ్ల నిర్మాణాలు కూ డా పూర్తిచేయగా, కేవలం ఎలక్ట్రికల్‌ పోల్స్‌కి వైర్లు వేయడం మిగిలి ఉంది. అలాగే 75 శాతం అండ ర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని సెఫ్టిక్‌ ట్యాంక్‌లను నిర్మించి కనెక్షన్‌ ఇస్తే సరిపోతుంది. ఇప్పటికే ప్రాథమికంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు, త్వరలోనే గృ హ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో డబుల్‌ బెడ్రూంల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించనున్నట్లు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ తెలిపారు. మంత్రి టూర్‌ షెడ్యూల్‌ను బట్టి గృహప్రవేశాలు చేపట్టనున్నారు. 

పెద్దపల్లిలో జెట్‌స్పీడ్‌.. 

పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో జెట్‌ స్పీడ్‌తో పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 160 ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా, ఇందులో 38 పూర్తయ్యాయి. మరో 122 ఇండ్లు సిమెంట్‌ పనులన్నీ పూర్తయ్యాయి. ఇంకా తలుపులు, కిటికీలు బిగించడం, విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడం మినహా పనులన్నీ అయిపోయాయి. మరి కొద్ది రోజుల్లోనే అన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

కాల్వశ్రీరాంపూర్‌లో 180..

కాల్వశ్రీరాంపూర్‌లోని పాండవుల గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో జీ ప్లస్‌ టూ విధానంలో చేపట్టిన 240 డబుల్‌ బెడ్రూంల నిర్మాణాలను ఎమ్మెల్యే దాసరి ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 180 ఇండ్లు పూర్తికాగా, మరో 60 చివరి దశలో ఉన్నాయి. ఈ 240 ఇండ్ల నిర్మాణంతో ఇక్కడ ఒక కాలనీగా కనిపిస్తుంది. గతంలో పాండవుల గుట్ట సమీపంలో ఒకే ఒక్క పోలీస్‌ స్టేషన్‌, జగత్‌ మహామునీశ్వరస్వామి ఆలయం మాత్రమే ఉండేది. ఇ ప్పుడు ఈ ఇండ్లు పూర్తి కావడంతో కాల్వశ్రీరాంపూర్‌ రూపురేఖలు మొత్తం మారిపోయాయి.  ఒక వైపు కస్తూర్బాగాంధీ పాఠశాల, మరోవైపు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పక్కన మార్కెట్‌ యార్డు ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం తో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. 

ప్రత్యేక దృష్టి 

భూముల సేకరణతో పాటు.. డబుల్‌ బెడ్రూం నిర్మాణాలకు ముందుగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఆరంభంలో నిర్మాణాల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం పలు ఆదేశాలను జారీ చేసింది. నిర్మాణాల కోసం.. నిర్మాణ సంస్థలకు కొన్ని అవకాశాలు కల్పించింది. దీంతో.. టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఫలితంగా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు.. ప్రస్తుతం మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసిం ది. దీంతో ఇండ్లు దాదాపు 95 శాతం వరకు పూర్తయ్యాయి. సదరు ఇండ్లకు మరిన్ని సౌకర్యా లు కల్పించి.. లబ్ధిదారులకు కేటాయించేందుకు  ఏర్పాట్లను అధికార యంత్రాగం చేస్తున్నది. అంతేకాదు, ఆయా జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిర్మాణాల్లో జాప్యం జరిగినా కారణాలు తెలుసుకొని.. సదరు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. డబుల్‌ నిర్మాణాలు జెట్‌స్పీడ్‌తో పూర్త య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.logo