మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Mar 10, 2020 , 01:55:59

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

ధర్మారం : మండల కేంద్రంతోపాటు పూర్వ అ సెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన నంది మేడారం లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ధర్మారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థా నిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పార్టీ ప్రజా ప్రతినిధులు, రెండు గ్రామాల నాయకులతో ప్ర త్యేకంగా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి ప నులపై చర్చించారు. అనంతరం మంత్రి కొప్పుల విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో పట్టణంగా ఎదగనున్న ధర్మారంలో అనేక అభివృద్ధి ప నులు చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు. అందు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఎస్సారెస్పీ డీ83/బీ కాలువ వరకు రూ.2 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రోడ్డు వెంటే కొత్తగా డ్రైనేజీ నిర్మా ణం చేపట్టి ఇరువైపులా సైడ్‌లైలింగ్‌ సిస్టం ఏర్పా టు చేస్తామని వెల్లడించారు. మెయిన్‌ రోడ్డు నుం చి ధర్మారంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు రోడ్డు విస్తరణ, ప్రహరీ నిర్మాణం, టౌన్‌ హా లు నిర్మాణం, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు, వైకుంఠధా మం, గ్రంథాలయం, సులబ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పనులు చేపడతామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉన్న క్రీడా మైదానం మరమ్మతులకు ని ధులు కేటాయిస్తామని మంత్రి ఈశ్వర్‌ తెలిపారు. 

నంది మేడారంలో రోడ్ల విస్తరణ

నంది మేడారం గ్రామంలో రోడ్ల విస్తరణతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామని మం త్రి ఈశ్వర్‌ స్పష్టం చేశారు. పెద్దపల్లి-ధర్మారం రో డ్డులోని పెట్రోల్‌ బంక్‌ నుంచి తెలంగాణ తల్లి విగ్ర హం దాకా రోడ్లను విస్తరించి, డ్రైనేజీ, సైడ్‌లైట్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. నంది రిజర్వాయర్‌ కట్ట కింద ఉద్యాన వనంతోపాటు పర్యాటక కేం ద్రం గా అభివృద్ధి  చేస్తామని మంత్రి హామీ ఇచ్చా రు. టౌన్‌ హాలు, సమీకృత భవన నిర్మాణం, గ్రంథాలయం, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయిస్తామన్నారు. 

ఆలయ అభివృద్ధికి కృషి..

గోపాల్‌రావుపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవంలో మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు లింగాల ఆనందరావు, చైర్మన్‌ గొల్లపల్లి సత్యనారాయణ అధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  ఆల య కమిటీ కోరిక మేరకు ఆలయం ఎదుట సింహద్వారం, గోపుర నిర్మాణం, గోడలకు  ప్రాకారాలు, కల్యాణ మండపం, షెడ్డు నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం సీజీఎఫ్‌ ద్వారా రూ.50 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ధర్మారం సర్పంచ్‌ పూస్కూరు జితేందర్‌రావు, నంది మేడారం, పత్తిపాక సింగిల్‌ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గూడూరి లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, సర్పంచ్‌ జనగామ అంజయ్య, ఎంపీటీసీలు ఎంపీటీసీ మిట్ట తిరుపతి, జనగామ లక్ష్మి, ధర్మారం, నంది మేడారం ఉప సర్పంచులు ఆవుల లత, కట్ట రమేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలామొద్దీన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సభ్యుడు పాకాల రాజయ్య, మండల సభ్యుడు పాక వెంకటేశం, సింగిల్‌ విండో డైరెక్టర్‌ భారత స్వామి, నాయకులు సామంతుల శంకర్‌, కట్ట స్వామి, రాచూరి శ్రీధర్‌, మిట్ట భరత్‌, సాన రాజేందర్‌, మిట్ట రాజయ్య, దూడ రాజు, రాచూరి రాజ్‌ కుమార్‌, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సల్వాజి మాధవరావు, కోమటిరెడ్డి మల్లారెడ్డి, సంకసాని సతీశ్‌ రెడ్డి, సందినేని కొమురయ్య, చింతల జగన్మోహన్‌ రెడ్డి, పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌, మేకల రాజయ్య పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

రామయ్యపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కొండపర్తి దినేష్‌కు రూ.25 వేలు, ఇల్లందుల రాజేశ్వరికి రూ.20,500 విలువైన చెక్కులను అందించారు. 

జాతర పోస్టర్ల విడుదల

ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవ పోస్టర్లను మంత్రి కొప్పుల విడుదల చేశారు. మంగళవారం జరిగే స్వామి వారి రథోత్సవానికి హాజరు కావాల్సిందిగా మంత్రి కొప్పులను నిర్వాహకులు ఆహ్వానించారు. కరీంనగర్‌లోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ పాలకుర్తి సత్తయ్య గౌడ్‌, ఎంపీటీసీ దాడి సదయ్య, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, నంది మేడారం సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, నాయకులు జుంజిపల్లి రమేశ్‌, చింతల జగన్మోహన్‌రెడ్డి, మోతె కనకయ్య, మూల మల్లేశం, మార్క బాలయ్య, మార్క రమేశ్‌,  కొండపర్తి వినోద్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>