ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Mar 10, 2020 , 01:53:31

గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్‌ విద్య

గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్‌ విద్య

ధర్మారం : మండల కేంద్రంలోని బ్రిలియంట్‌ ఉన్నత పాఠశాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో కా ర్పొరేట్‌ స్థాయి ఆంగ్ల  విద్యను అందించడం అభినందనీయమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కొనియాడారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం రాత్రి నిర్వహించిన బ్రిలియంట్‌ మోడల్‌ పాఠశాల సిల్వర్‌ జూబ్లీ (25వసంతాలు) వేడుకలకు మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1995లో కేవలం 30 మంది విద్యార్థులతో మొదలైన విద్యా సంస్థను, ప్రస్తుతం వివిధ జిల్లాలకు విస్తరించడంపై పాఠశాల చైర్మన్‌ సిరిపురం సత్యనారాయణను అభినందించారు. ఇక్కడి ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందించడం వల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపిస్తున్నారని చెప్పారు. వేలాది మంది విద్యార్థులతో శాఖలుగా విస్తరించడానికి తల్లిదండ్రుల నమ్మకమే కారణమని పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు రాష్ర్టా స్థాయి ర్యాంకులు సాధించడం హర్షనీయమన్నారు. సాధ్యమైనంత మేర పేద, మధ్య తరగతి పిల్లలకు ఆంగ్ల విద్యను అందించాలని పాఠశాల చైర్మన్‌ సత్యనారాయణకు సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ మాట్లాడుతూ సేవా దృక్పథంతో పాఠశాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులను  టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుకుంటూనే కుటుంబ  విలువలను తెలుసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాల చైర్మ న్‌ సిరిపురం సత్యనారాయణ అధ్యక్షత వహించ గా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూ స్కూరు పద్మజ, సర్పంచ్‌ పూ స్కూరు జితేందర్‌రావు, నంది మేడారం సింగిల్‌ విండో చైర్మన్‌ ము త్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గూడూరి లక్ష్మణ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలామొద్దిన్‌, వెల్గటూరు ఏఎంసీ చైర్మన్‌ ఏలేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. logo