శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 10, 2020 , 01:51:08

‘పట్టణ ప్రగతి’ ప్రతిఫలం

‘పట్టణ ప్రగతి’ ప్రతిఫలం

గోదావరిఖని టౌన్‌ : నగర పాలక సంస్థ నిర్వహించిన పట్టణ ప్రగతిలో నిర్వహించిన పనుల వల్ల ప్రతిఫలం లభించింది. నగర నడిబొడ్డున 31వ డివిజన్‌లోని కూరగాయల మార్కెట్‌ యార్డులోని మాంసం మార్కెట్‌ తరలింపు వల్ల ఆ ప్రాంత ప్రజలతో పాటు ప్రతి రోజు మార్కెట్‌ వచ్చే వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. కూరగాయల మార్కెట్‌లో ఒక వైపు తాత్కాలికంగా మాంసం విక్రయ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతం దుర్వాసన, దుర్గంధంతో ఉండేది. ఈ విషయంపై ప్రజలు ఎన్ని పర్యాయాలు అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం దక్కలేదు. వీటికి తోడుగా పక్కనే పెద్ద మురుగు కాల్వ ప్రవహించేది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే, పట్టణ ప్రగతిలో భాగంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కోరుకంటి చందర నగర మేయర్‌ లడా.బంగి అనిల్‌కుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ లకు స్థానిక కార్పొరేటర్‌ అడ్డాల స్వరూప రామస్వామి సమక్షంలో విన్నవించారు. ఈ క్రమంలో నాయకులు, అధికారులు స్పందించారు. జంతు వదశాలను ఇక్కడ నుంచి ప్రభుత్వం దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన జంతు వదశాలకు తరలించాలని అప్పటికప్పుడు ఆదేశించారు. దీంతో కార్పొరేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌ శివారులో నిర్మించిన జంతువదశాలకు తరలించారు. దీంతో వార్డు ప్రజలతో పాటు ప్రతి రోజు మార్కెట్‌కు వచ్చిపోయే వేలాది మంది ప్రజలకు ఈ దుర్వాసన నుంచి విముక్తి చెందారు. 


logo