మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 07, 2020 , 00:55:16

కాళేశ్వరం జలాల పరుగులు

కాళేశ్వరం జలాల పరుగులు

పెద్దపల్లి ప్రతినిధి/ ధర్మారం : కాళేశ్వర జలాలు పరుగులు తీస్తున్నాయి. దిగువన లింక్‌-1లో పెద్దపల్లి జిల్లాలోని సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌లలో మోటర్లను ఆఫ్‌ చేసి విశ్రాంతి ఇవ్వగా, లింక్‌-2 లో ఒక్క మోటర్‌ను అధికారులు నడిపిస్తున్నారు. ధర్మారం మండలం నంది మేడారంలోని నందిపంప్‌హౌస్‌లో 4వ మోటర్‌ను అధికారులు ఆన్‌చేసి, 3,150 క్యూసెక్కుల జలాలను నంది రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరుతున్నా యి. ఇక్కడ 2వ మోటర్‌ను నడిపిస్తుండగా 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నది. కాగా, ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏఈఈలు శ్రీనివాస్‌, వైద సురేష్‌కుమార్‌, రమేశ్‌ నాయక్‌, వెంకటేష్‌, వరదకాలువ ఏఈఈ తిరుపతి ఉన్నారు.


ఎస్‌ఆర్‌ఆర్‌ నుంచి 1230 క్యూసెక్కులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 1230 క్యూసెక్కుల నీటిని పంపించా రు. ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం రివర్స్‌ స్లూయిస్‌ ద్వా రా దిగువకు నీటిని పంపుతున్నారు. జలాశయం లో 24.849 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. కా గా, లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపు హౌస్‌ నుంచి వస్తున్న నీటిని యధావిధిగా దిగువకు పంపుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 


ఎల్‌ఎండీలో 11.491 టీఎంసీలు 

ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ నుంచి ఎల్‌ఎండీకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి శుక్రవారం 2319 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తున్నది. ఇక్కడి నుంచి 5838 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో రూపంలో బయటికి వెళ్తున్నది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.491 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.logo