శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 06, 2020 , 03:21:32

కార్పొరేట్‌కు దీటుగా సర్కారు వైద్యం

కార్పొరేట్‌కు దీటుగా సర్కారు వైద్యం

ఫెర్టిలైజర్‌సిటీ : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన కొనసాగుతున్నద ని, కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా సర్కారు వై ద్యం అందుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కో రుకంటి చందర్‌ స్పష్టం చేశారు. వైద్యానికి మొ దటి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ దవాఖానలకు అభివృద్ధి పరుస్తున్నారని పేర్కొన్నారు. ఖనిలోని ప్రభుత్వ వంద పడకల దవాఖాన ఆవరణలో నైట్‌ షెల్టర్స్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. దవాఖానలో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఖని ద వాఖానలో ఇప్పటికే ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూతోపాటు డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేశామనీ, కార్పొరేట్‌కు దీటుగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో బ్లడ్‌ బ్యాంక్‌ లేకపోవడంతో రక్తం అవసరం అయినవా రు కరీంనగర్‌, మంచిర్యాలకు వెళ్లే పరిస్థితి ఉం డేదన్నారు. ఎన్నికల హామీ మేరకు రక్తనిధిని ఏర్పా టు చేసినట్లు తెలిపారు. అనంతరం విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌ రావుతోపాటు పలువురు రక్తదానం చేశారు. దవాఖాన అభివృద్ధితోపాటు బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సహకరించిన ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారి ఇస్లాం, సూపరింటెండెంట్‌ డా.కంది శ్రీనివాస్‌ రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. ఇక్కడ నగర మేయర్‌ అనిల్‌కుమార్‌,  కార్పొరేటర్లు నగునూరి సుమలత, బాల రాజ్‌కుమార్‌, శివకుమార్‌, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు గోలివాడ చంద్రకళ, రాజేశ్వరరావు, నా యకులు బొడ్డు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, వంగ వీరస్వామి, నూతి తిరుపతి, జాహిద్‌ పాషా, సంతోష్‌ రావు, గాజె సతీశ్‌, నాగరాజు పాల్గొన్నారు. 


logo