గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 06, 2020 , 03:20:25

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

సుల్తానాబాద్‌రూరల్‌ : రైతు సంక్షేమమే లక్ష్యం గా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నద ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమం త్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం సింగిల్‌విండో చైర్మన్‌ మోహన్‌రావుతోపాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దాసరి మాట్లాడారు. రైతు సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కిందని పేర్కొన్నా రు. రైతు సమస్యలను పరిష్కరించడంతోపాటు గో దాం నిర్మాణం, పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన దేవరనేని మోహన్‌రావును రైతులు మూడోసారి ఏకగ్రీవం గా ఎన్నుకోవడం అభినందనీయమని కొనియాడారు.  


అంతకు ముందు సింగిల్‌ విండో చైర్మన్‌ మోహన్‌రావు, వైస్‌ చైర్మన్‌ కందుల రాజు, డైరెక్ట ర్లు గుర్రం సత్తయ్య, మేరుగు అంజయ్య, మా మిడి లింగయ్య, మ్యాకల వీరయ్య, నలువాల శ్రీకాంత్‌, పోచంపల్లి పద్మ, తాండ్ర నిర్మల, లోకిని సంప త్‌, అన్నమనేని మాధవరావు, భూషనబోయిన విజయ్‌కుమార్‌, సట్టు నారాయణ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్‌ మోహన్‌రా వు బాధ్యతలు స్వీకరించగా, ఎమ్మెల్యే దాసరితోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ మినుపాల స్వరూపారాణి, సింగిల్‌ విం డో చైర్మన్‌ జూపల్లి సందీప్‌రావు, సర్పంచులు ఏరుకొండ రమేశ్‌గౌడ్‌, ఆర్నకొండ రాజు, సాగర్‌రావు, లోకిని కోమలత, ఎంపీటీసీలు సంపత్‌, రమేశ్‌, ఫకీర్‌ యాదవ్‌, నాయకులు తిప్పారపు దయాకర్‌, కొయ్యడ అరుణ్‌, మినుపాల ప్రకాశ్‌రావు, దేవేందర్‌రావు, సుగుణాకర్‌రావు, ఏరుకొండ అరుణ, సీఈఓ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>