బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 05, 2020 , 02:01:12

పల్లెప్రగతి

 పల్లెప్రగతి

కాల్వశ్రీరాంపూర్‌ : రైతులకు సేవలందించడం లో సహకార సంఘాలు ముందుండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపుని చ్చారు. కాల్వశ్రీరాంపూర్‌, కూనారం సహకార సంఘం నూతన పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కాల్వశ్రీరాంపూర్‌ సహకార సంఘం పదవీ ప్రమా ణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఉన్న దివంగత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాల్వ రాంచంద్రారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి సమక్షంలో సహకార సంఘం చైర్మన్‌గా చదు వు రాంచంద్రారెడ్డి , వైస్‌ చైర్మన్‌గా కామిడి సంధ్య పదవీ బాధ్యతలు స్వీకరించగా, వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడా రు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో రైతులకు పెద్దపీట వేస్తున్నదని వివరించారు. రైతు బంధు, బీమా, రుణమాఫీ, సాగునీటి సరఫరా, పంటలకు మద్దతు ధర, 24గంటల ఉచిత విద్యు త్‌ అందిస్తున్నదని చెప్పారు. కునారం విండో చైర్మన్‌గా గజవెళ్లి పురుషోత్తం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీ సభ్యు డు వంగళ తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ జూకంటి శిరీష, ఎంపీడీఓ కిషన్‌, తాసిల్దార్‌ వేణుగోపాల్‌, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు కొట్టె రవీందర్‌, సీఈఓ కోలేటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.    


పచ్చదనంతో కళకళలాడాలి

పచ్చదనంతో పల్లెలు కళకళలాడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గ్రామాలు బాగు పడుతాయనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. గ్రామాలు పచ్చంగా ఉంచే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారులదేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో నిర్వహించే పచ్చదనం-పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని భాగస్వాములు చేయాలని సూ చించారు. ప్రతి శుక్రవారం గ్రామంలో సామూహిక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలనీ, గ్రామస్తులంతా పాల్గొనేలా చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ కంపోస్ట్‌ ఫిట్‌, ఇంకుడు గుంతలు తప్పని సరిగా ఉండేలా చూసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు. గ్రామాల్లో పచ్చదనం కోసం ఇంకా విస్తృతంగా మొక్కలు నాటించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. సేంద్రియ వ్యవసాయం, పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులను వంద శాతం వినియోగించుకోవాలని వివరించారు. గ్రామాభివృద్ధికి ప్రతి గ్రామంలో బడ్జెట్‌ తయారు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో మిగిలిన సీసీ రోడ్లు ఈ నెల 25తేదీలోగా పూర్తి చేయించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. మంత్రి అనుమతితో మండలంలో మరిన్ని రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీ పీ నూనేటి సంపత్‌, జడ్పీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ కిషన్‌, తాసిల్దార్‌ వేణుగోపాల్‌, కూనారం విండో చైర్మెన్‌ గజవెళ్లి పురుషోత్తం, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, వైస్‌ ఎంపీపీ జూకంటి శిరీష, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 


గ్రామాలాభివృద్ధికి ప్రత్యేక నిధులు

పెద్దపల్లి జంక్షన్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. అందుగులపల్లిలో 24 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలు సమగ్రాభివృద్ధి చెంది తేనే అది నిజమైన ప్రగతి అని సీఎం కేసీఆర్‌ భా వించి అనేక పథకాలు ప్రవేశపెడు తున్నారని వివరించారు. ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెల నెలా నిధులను కేటాయిస్తుందని పేర్కొన్నారు. కార్యక్ర మంలో జడ్పీ సభ్యుడు బండారి రామ్మూర్తి, సర్పంచ్‌ శారద శ్రీనివాస్‌, ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణ్‌, ఉప సర్పంచ్‌ స్వప్న సాగర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మర్కు లక్ష్మణ్‌, రాజేశం, సదయ్య తదితరులు పాల్గొన్నారు.  


రైతుల అభివృద్ధికి కృషి చేయాలి

పీఏసీఎస్‌ పాలకవర్గం రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అప్పన్నపేట పీఏసీఎస్‌ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఇటీవల పీఏసీఎస్‌ చైర్మన్‌గా దాసరి చంద్రారెడ్డి ఎన్నిక కాగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు ఎమ్మెల్యే దాసరి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సభ్యుడు బండా రి రామ్మూర్తి, వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ  హబీబ్‌ ఉర్‌ రెహమాన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>