సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 04, 2020 , 05:02:07

పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్‌

పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్‌
  • అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో భరోసా
  • ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సర్కారు మాదే
  • అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలి
  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • నియోజకవర్గంలో ఒకే రోజు 348 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ
  • ఎలిగేడు, ఓదెల మండలాలు.. సుల్తానాబాద్‌ టౌన్‌లో అందజేత

సుల్తానాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ని రుపేదకూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ఉద్ఘాటించారు. సుల్తానాబాద్‌ పట్టణంతోపాటు ఎలిగేడు, ఓదెల మండలాలకు చెందిన 348 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఆయన మంగళవారం పం పిణీ చేశారు. సుల్తానాబాద్‌ పట్టణంలో 187 మం ది లబ్ధిదారులకు రూ.1,85,00,576 విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే దాసరి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్న డూ పేదలను పట్టించకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాతే ఇంత పెద్దమొత్తంలో ఒక్క మండలానికే కోట్ల రూపాయలు మంజూరు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌ పేదల పక్షపాతి అని, ఆయన పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు రూ.1 లక్ష అందించి అండగా ఉంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత, ఎంపీపీ పొన్నమనేని బా లాజీరావు, జడ్పీటీసీ మనుపాల స్వరూపరాణి, తాసిల్దార్‌ హన్మంతరావు, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, బుర్ర శ్రీనివాస్‌, ముత్యం రమేశ్‌ గౌడ్‌, పాల రామారావు, కోయ్యడ అరుణ్‌, కొట రాంరెడ్డి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. 


ఎలిగేడు(జూలపల్లి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నడూ లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు శ్రీకారం చుట్టి కుల, మతాలకతీతంగా ఆడబిడ్డల పెండ్లి ఖర్చులు అందిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎలిగేడు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ మండిగ రేణుకతో కలిసి ఆయన 40 మంది లబ్ధిదారులకు రూ.40,04,640 విలువైన చెక్కులు పంపిణీ చేశా రు. 154 మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి మంజూరు చేయించడానికి కొంతమంది దళారులు తిరుగుతున్నారని, ఎవరినీ ఆశ్రయించకుండా లబ్ధిదారులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎవరూ పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభు త్వం వినూత్న పథకాలు, అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకోడానికి పంటల పెట్టుబడి, నిరంతర విద్యుత్‌, రైతు బీమా, పంటలకు మద్ధతు ధర, ఆసరా ఫించన్లు అందిస్తున్నామని వెల్లడించారు. 


ప్రజల బాగోగులు చూస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశా రు. ఇక్కడ ఎంపీపీ తానిపర్తి స్రవంతి, ఎంపీటీసీలు నారగోని ఎల్లవ్వ, తూడి లక్ష్మి, సర్పంచులు భూర్ల సింధూజ, దుగ్యాల శ్వేత, తంగెల్ల స్వప్న, సింగిరెడ్డి ఎల్లవ్వ, మాడ కొండల్‌రెడ్డి, పెద్దోల్ల ఐలయ్య, రాచర్ల కొండయ్యరాజా, అర్షనపెల్లి వెంకటేశ్వర్‌రావు, తాసిల్దార్‌ పద్మావతి, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్‌రెడ్డి, సింగిల్‌  విం డో చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ చింతిరెడ్డి గణపతిరెడ్డి, నాయకులు బైరెడ్డి రాం రెడ్డి, గుడుగుల మహేందర్‌, కొత్తిరెడ్డి శరత్‌రెడ్డి, కవ్వంపెల్లి సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓదెల : ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని 121 మంది లబ్ధిదారులకు రూ.1,21,14,036 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా ఇంత గొప్పగా పథకాలు అమలు చేయలేదనీ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కావటి రాజు, వైస్‌ఎంపీపీ పల్లె కుమార్‌, మాజీ విండో చైర్మన్‌ గోపు నారాయణరెడ్డి, ఇన్‌చార్జి తాసిల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీఓ సత్తయ్య, గిర్దావర్‌ వినయ్‌కుమార్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 


logo