సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 04, 2020 , 04:53:15

సౌకర్యాలు కల్పించాలి

సౌకర్యాలు కల్పించాలి
  • గోదారి తీరానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
  • నదీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
  • త్వరలోనే ఎలక్ట్రికల్‌ క్రిమేషన్‌ మిషన్‌ను ఏర్పాటుచేస్తాం
  • జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • పట్టణ శివారులో విస్తృత పర్యటన
  • జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథనిటౌన్‌ : మంథని గోదారి తీరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి గోదావరి నది తీరాన్ని, డంప్‌ యార్డు, పట్టణంలోని ప్రధాన చౌరస్తాలను ద్విచ క్ర వాహనంపై ప్రయాణిస్తూ సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి తీరంలో ఎలక్ట్రికల్‌ క్రిమేషన్‌ మిషన్‌ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించడంతోపాటు మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, శ్రీ సీతారామ సేవా సదన్‌ సభ్యులు, అధికారులతో చర్చించారు. అనంతరం డంప్‌ యార్డు ను సందర్శించారు. డంప్‌ యార్డు స్థలాన్ని రెవె న్యూ అధికారులు సర్వే చేయాలని ఆదేశించారు. 1, 11వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంథనితోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం వస్తుంటారని, వారి సౌకర్యార్థం గోదావరి తీరం లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జడ్పీ చైర్మన్‌ సూచించారు. తాసిల్దార్‌ అనుపమారావు, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లిఖార్జునస్వామి, ఆర్‌ఐ అమృత్‌కుమార్‌, కౌన్సిలర్లు విజయలక్ష్మి, వీకే రవి పాల్గొన్నారు. 


వెంకటయ్య సేవలు చిరస్మరణీయం.. 

ట్రేడింగ్‌ యూనియన్‌ నాయకుడిగా, సింగిరేణి రిటైర్డు కార్మికుల సంఘం మంథని నియోజకవర్గ అధ్యక్షుడిగా లక్కాకుల వెంటకటయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు పేర్కొన్నారు. ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్‌ అసోసియేషన్‌ నాయకులు స్థానిక ఎల్లమ్మ  దేవాలయ సమీపంలో లకాక్కుల వెంకటయ్య సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పుట్ట మధు ముఖ్యఅతిథిగా హాజరై, వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.


logo