సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Mar 03, 2020 , 02:28:08

ఆత్మవిశ్వాసమే ఆయుధం

ఆత్మవిశ్వాసమే ఆయుధం

జూలపల్లి : ఆత్మవిశాస్వమే ఆయుధంగా క్రీడాకారులు ముందుకుసాగాలనీ, అంచెలంచెలుగా రాణిస్తూ జాతీ య స్థాయికి ఎదగాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు సూ చించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ‘నేనున్నా’ స్వచ్ఛంద సే వా సంస్థ వ్యవస్థాపకుడు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, తన తండ్రి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మహవీర్‌సింగ్‌ జ్ఞాపకార్థం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థా యి వాలీబాల్‌ పోటీల ముగింపు సమావేశానికి సోమవారం రాత్రి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన, క్రీడాకారుల నైపుణ్యం వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వాలీబాల్‌ పోటీలు ఏర్పాటు చేసి క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్న రఘువీర్‌సింగ్‌కు క్రీడాకారులు గజమాల వేసి సన్మానించారు. నిస్వార్థంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

విజేత జట్లు ఇవే..

పోటీల్లో 38 జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో మొదటి స్థానంలో నిలిచిన కరీంనగర్‌ సిటీ హాస్పిటల్‌ జట్టుకు 10 వేలు, రెండో స్థానంలో నిలిచిన జూలపల్లి జట్టుకు 7 వేలు, మూడో స్థానంలో నిలిచిన గర్షకుర్తి జట్టుకు 5 వేలు, నాల్గో స్థానంలో నిలిచిన కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ జట్టుకు 3 వేలు బహుమతులతోపాటు, ట్రోపీలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్‌, జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్‌, సర్పంచులు దారబోయిన నరసింహం, మాంకాలి తిరుపతి, కుంటూరి రాజయ్య, మండల ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు దండె వెంకటేశం, జూలపల్లి, ధూళికట్ట సింగిల్‌ విండో చైర్మన్లు కొంజర్ల వెంకటయ్య, పుల్లూరి వేణుగోపాల్‌రావు, ఉప సర్పంచ్‌ కొప్పుల మహేశ్‌, కోఆప్షన్‌ సభ్యుడు లాల్‌మహ్మద్‌, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ విశారపు వెంకటేశం, తాసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ వేణుగోపాల్‌రావు, ఇన్‌చార్జి ఎంఈఓ కవిత, ఎస్‌ఐ శీలం లక్ష్మన్‌, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజయ్య, జూలపల్లి స్పోర్ట్స్‌ క్లబ్‌ నిర్వాహకులు అమరగాని గంగాధర్‌గౌడ్‌, దామెర కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తదితరులున్నారు.


logo