బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 03, 2020 , 02:23:57

‘నీరా’తో సంపూర్ణ ఆరోగ్యం

‘నీరా’తో సంపూర్ణ ఆరోగ్యం

మంథని రూరల్‌ : తాటి, ఈత చెట్ల ద్వారా వచ్చే కళ్లు ఎంతో మధురంగా ఉంటుందనీ, నీరా తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సూరయ్యపల్లి గ్రా మంలోని కల్లు మండువాలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల తో కలసి ఆయన నీరా తాగారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ తెలంగాణ కల్లుగా పిలువబడే తెల్లకళ్లును, నీరాను తాగడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పారు. శరీరంలోని చెడు క్రిములను నీరా తరమికొడుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు తెలిపారని గుర్తు చేశారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నీరా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. దీని వలన గౌడ కులస్థులకు ఆర్థికంగా భరోసా దొరకడంతోపాటు ప్రజలకు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చని పే ర్కొన్నారు. అనంతరరం పుట్ట మధుకు గౌడ సం ఘం నాయకులు ప్రత్యేక కృతజతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భీముని పుష్ప, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు ఏగోళపు శంకర్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకుల కిరణ్‌ నాయకులు ఆకుల బాపు, నక్క శంకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>