బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 01, 2020 , 01:56:35

పచ్చదనం పెంపొందించాలి

పచ్చదనం పెంపొందించాలి

పెద్దపల్లిరూరల్‌: గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనంతో ఉండేలా చెట్లను పెంచుకోవాలనీ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామానికి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు శనివారం పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలాభివృద్ధి కోసం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేందుకు హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు ట్రాక్టర్లను వినియోగించాలన్నారు. గ్రామా ల్లో చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించేందుకు ట్రాక్టర్లను వాడుతూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజు, సర్పంచ్‌ కారుపాకల మానస, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కారుపాకల సంపత్‌, మాజీ సర్పంచ్‌ మొగుసాల సర్వోత్తంరెడ్డి, ఉప సర్పంచ్‌ నిర్మల, నాయకులు నరేశ్‌, సంపత్‌, రాజేశం, సారయ్య తదితరులు పాల్గొన్నారు. logo