ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Feb 29, 2020 , 00:58:50

‘కాళేశ్వరం’ గొప్ప నిర్మాణం

 ‘కాళేశ్వరం’ గొప్ప నిర్మాణం

ధర్మారం:  కాళేశ్వరం గొప్ప నిర్మాణమని నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్‌ కొనియాడారు. నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌ను నాబా ర్డు రాష్ట్ర స్థాయి అధికారులు, ఉమ్మడి జిల్లాల డీడీఎంలు శుక్రవారం సందర్శించారు. మొత్తం 19 మంది అధికారుల బృందం ఇక్కడికి వచ్చింది. నాబార్డు తెలంగాణ రీజినల్‌ కార్యాలయం హైదరాబాద్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, జీఎంలు కేఐ ఫరీఫ్‌, బీకే మిశ్రా, డిప్యూటీ జీఎంలు జి. శాంతనం, వైవీఎన్‌ లతారాణి, ఆర్‌ ఇంగో అరుల్‌ సెల్వన్‌, సుకుంట కుమార్‌ సాహూ, అసిస్టెంట్‌ జీఎం శివ తులసి దేవతతోపాటు కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొం డ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల డీడీఎంలు పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ముం దుగా పంప్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం టన్నెల్‌లోని సర్జ్‌పూ ల్‌, జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ను పరిశీలించగా, ప్రాజెక్టుపై కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం విశేష కృషి చేసినందుకు ప్రాజెక్ట్‌ ఈఎన్సీని సీజీఎం శాలు వా కప్పి సన్మానించారు. ఈ సంద ర్భంగా సీజీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉందనీ, ఇంజి నీరింగ్‌కు ప్ర తిభకు నిదర్శనమని కితాబిచ్చారు. దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి నీటి సరఫరా చేసి సత్ఫలి తాలు సాధించడం అభినంద నీయమన్నారు. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో 6,7 ప్యాకేజీల డీఈఈ గునిగంటి నర్సింగారావు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


logo