శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 27, 2020 , 00:20:08

కలెక్టరేట్‌కు తుది మెరుగులు

కలెక్టరేట్‌కు తుది మెరుగులు

పెద్దపల్లి జంక్షన్‌:  జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రా రంభోత్సవానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది.  ప్రభు త్వ సేవలన్నీ ఓకే చోట అందేరోజు దగ్గరలోనే కనిపిస్తున్నది. పెద్దపల్లి మండలం పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు ఆవరణలో నిర్మితమవుతున్న ఈ అతిపెద్ద భవంతి, ఇప్పటికే 95 శాతం పను లు పూర్తిచేసుకొని తుదిదశకు చేరుకోగా, వచ్చే మార్చి చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశముందని యంత్రాంగం పేర్కొంటున్నది.

రూ.40.8 కోట్లతో నిర్మాణం

కొత్త జిల్లాగా అవతరించిన పెద్దపల్లిలో మొద ట్లో కలెక్టరేట్‌ను తాత్కాలికంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసి పాలన కొనసాగించారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లకు పక్కాభవనాలు ఉండాలని ప్రభుత్వ భావించింది. ఈ క్రమంలో  రూ. 40.8 కోట్లు మం జూరు చేయగా, పెద్దపల్లి మండలం పెద్దకల్వల శివారులోని ఎస్సారెస్పీ క్యాంపు ఆవరణలో 21 ఎకరాల స్థలంలో అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల్లో సువిశాలమైన సకల సౌకర్యాల గదులను నిర్మిస్తున్నారు. కలెక్టరేట్‌ సముదాయాన్ని ఏ,బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌ బ్లాక్‌లుగా విభజించి పనులు చేపట్టగా, తుది దశకు చేరాయి. 

నిర్మాణంలో అత్యాధునిక పరిజ్ఞానం.. 

కొత్త కలెక్టరేట్‌ను అత్యాధునిక పరిజ్ఞానం, పూర్తి నాణ్యతా ప్రమాణాలు, సకల వసతులతో నిర్మించారు. జీ ప్లస్‌ టూ విధానంలో ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌ బ్లాక్‌లుగా విభజించారు. ఇందులో ఏ,బీ, సీ,డీ బ్లాక్‌లను అన్ని శాఖలకు చెందిన కార్యాలయాలు ఉండగా, ‘ఇ’ బ్లాక్‌ ప్రవేశ బ్లాక్‌గా, ‘ఎఫ్‌' బ్లాక్‌ బయటకు వెళ్లే బ్లాక్‌గా నిర్మాణాలు చేపట్టారు. ఏ బ్లాక్‌లో మీటింగ్‌ హాల్‌, బీ బ్లాక్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, డీఆర్వో కార్యాలయాలతోపాటు ఫస్ట్‌ఫ్లోర్‌లో 40శాఖలకు సం బంధించిన కార్యాలయాలు నిర్మించారు. సీ బ్లాక్‌ ఎన్‌ఐసీ రూంతోపాటు ఏటీఎంతోపాటు దుకాణాలకు కేటాయించారు. డీ బ్లాక్‌లో కాన్పరెన్స్‌ హాల్‌తో పాటు కమ్యూనిటీ టాయిలెట్స్‌కు కేటాయించారు. సిబ్బంది, అధికారుల కోసం నాలు గు లిప్ట్‌లు కూడా బిగిస్తున్నారు. ఇప్పటికే పెయింటింగ్‌, ఫ్లోరింగ్‌ పనులు పూర్తయ్యాయి.  ప్రస్తు తం ఎలివేషన్‌ పనులతోపాటు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, శానిటేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. 

సకల వసతుల కల్పన.. 

సమీకృత కలెక్టరేట్‌ను సకల వసతులతో నిర్మించారు. విశాలమైన మీటింగ్‌ హాల్‌ పూర్తి చేశారు. ఇందులో అత్యాధునిక సౌండ్‌ సిస్టం ఏ ర్పాటు చేయనున్నారు.  ప్రజల కోసం వె యిటింగ్‌ హాల్‌, ఎన్‌ఐసీలో ప్రొజెక్టర్‌ పెట్టనున్నా రు. కలెక్టరేట్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దుకాణాలు, డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంను ఏర్పాటు చేయనున్నారు. ఆవరణలో ఆహ్లా ద, అందమైన గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు.

పూర్తయిన క్యాంపు ఆఫీసులు.. 

సమీకృత కలెక్టరేట్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారుల క్యాంపు ఆఫీసుల నిర్మాణ పనులను చేపట్టగా, శరవేగంగా కొనసాగుతున్నాయి. అధికారుల నివాసాల కోసం ప్రభుత్వం రూ. 6.58 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ క్యాంపు ఆఫీసులు పూర్తయ్యాయి. డీఆర్వోతోపాటు మరో ఎనిమిది మంది జిల్లా స్థాయి అధికారుల నివాస గృహాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 


logo