ఆదివారం 24 మే 2020
Peddapalli - Feb 27, 2020 , 00:16:09

విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం

విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం

జూలపల్లి: ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టంచేశారు. మండలకేంద్రంలోని ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సర్వశిక్ష అభియాన్‌ పథకం కింద మంజూరైన రూ.9 లక్షల నిధులతో ‘సైన్స్‌ ల్యాబ్‌' భవన నిర్మాణపు పనుల ను ఎమ్మెల్యే, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద రూ.1.10లక్షల నిధులతో ఏర్పాటు చేసిన హైమా స్ట్‌ విద్యుత్‌ దీపాలనూ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కలిస్తోందని అన్నారు. కాగా హెచ్‌ఎం సరస్వతిని పాఠశాల సమస్యలు, విద్యార్థుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌, సర్పంచులు దారబోయిన  నరసింహం, మేచినేని సంతోశ్‌రావు, ఎంపీటీసీ సభ్యులు అమరగాని మమత, దండె వెంకటేశం, తమ్మడవేని మల్లేశం, ధూళికట్ట సింగిల్‌ విండో చైర్మన్‌ పుల్లూరి వేణుగోపాల్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఏదుల్ల కనుకయ్య, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు లాల్‌మహ్మద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శాతళ్ల కాం తయ్య, నాయకులు సొల్లు శ్యామ్‌, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, ఖాసీం, పొలవేని సతీశ్‌, అంకూ స్‌, చీదురు శ్రీనివాస్‌, తొగరు శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయం

ఓదెల: గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉప్పరపల్లి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం పల్లెప్రగతి కార్యక్రమా న్ని చేపట్టారని గుర్తుచేశారు. జీపీకో ట్రాక్టర్‌ ఉండ డం వల్ల గ్రామంలో పరిశుభ్రతను నెలకొల్పడాని కి వీలవుతుందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వాహనాలను వినియోగించుకుని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పల్లె ఓదె లు, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ గోపు నారాయణరెడ్డి, ఉపసర్పంచ్‌ ఏనుగుల సదయ్య, నాయకులు పెద్దస్వామి, కొప్పుల రాజయ్య, పల్లె రాజ య్య, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

లంబాడితండా ఆటో ట్రాలీ ప్రారంభం

లంబాడితండా గ్రామపంచాయతీ ఆటోట్రాలీని బుధవారం పూజలు చేసి ప్రారంభించారు. కొత్త గా ఏర్పడిన తండా పంచాయతీకి పాలకవర్గం ఆటోట్రాలీని కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, సర్పంచ్‌ గుగులోతు లక్ష్మి, ఉపసర్పంచ్‌ గుగులోతు నిమ్మనాయక్‌, వార్డుసభ్యుడు గుగులోతు దేవీలాల్‌, వస్త్రంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo