శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 27, 2020 , 00:15:38

ఫలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృషి

ఫలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృషి

ధర్మారం: రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌ కృషి ఫలించింది. మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామం వద్ద ఎస్సారెస్పీ కాల్వకు నూతన తూము ఏర్పాటు చేయించడంతో కాల్వ నీరు  మండలకేంద్రంలోని శీతల చెరువులోకి చేరి జలకళ సంతరించుకుంది. దీంతో 10సంవత్సరాల పైబడి రైతులు ఆ చెరువు కింద వరినాట్లు సాగు చేశారు. ఏళ్ల తరబడి నుంచి నీరులేని చెరువులో ఇప్పుడు పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగుంటపల్లిలోని ఎస్సారెస్పీ డీ83/బీ కాల్వ తూము నుంచి నీరు చెరువులోకి వచ్చి చేరేవి. అయితే కాల్వ తూము  చిన్నదిగా ఉండడం వల్ల నీళ్లు సరిపడా రావడంలేదని, దానిస్థానంలో పెద్ద తూము ఏర్పాటు చే యించాలని సర్పంచ్‌ పూస్కూరు జితేందర్‌రావు, ఎంపీటీసీలు మేడవేని తిరుపతి, తుమ్మల రాంబా బు మంత్రి ఈశ్వర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయ న వెంటనే స్పందించి ఎర్రగుంటపల్లి వద్ద కొత్తతూము ఏర్పాటుకు అవసరమైన నిధులు మం జూరు చేయడంతో పాత తూమును తొలగించి, దాని స్థానంలో కొత్త తూమును నిర్మించారు. అయితే ఈ యాసంగికి కాల్వ నీరు విడుదల కావడంతో తూము ద్వారా విడుదలైన నీరు ఊరుకుంట నుంచి శీతల చెరువులోకి చేరి జలకళ సంతరించుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ చెరువు కింద వరి సాగుతో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కాగా నూతన తూమును ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి ఈశ్వర్‌కు రైతులతో పాటు మత్స్యకార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. 


logo