శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 27, 2020 , 00:14:35

జడ్పీ స్థాయీసంఘం సమావేశాల తేదీలు ఖరారు

జడ్పీ స్థాయీసంఘం సమావేశాల తేదీలు ఖరారు

పెద్దపల్లి రూరల్‌: జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించేందుకు అధికారయంత్రాంగం ముహుర్తం ఖరారు చేసింది. ఈ మేరకు సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినోద్‌ బుధవారం విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఏర్పడిన అనంతరం ఏర్పాటైన స్థాయీసంఘాల సమావేశం జనవరి 3,4 తేదీల్లో జరగాల్సి ఉండగా, సభ్యుల కోరం లేక వాయిదాపడిన విషయం తెలిసిందే. తిరిగి 60 రోజులకు మార్చి 2, 3 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేయడం జరిగిందని జడ్పీ సీఈఓ వినోద్‌ పేర్కొన్నారు. మార్చి 2న మూడో స్థాయీ సంఘం (వ్యవసాయం) అధ్యక్షురాలు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగ రేణుక అధ్యక్షతన ఉదయం 11 గంటలకు, 5వ స్థాయీ సంఘం(స్త్రీ, శిశుసంక్షేమం)అధ్యక్షురాలు, ధర్మారం జడ్పీటీసీ పుస్కూరి పద్మజ అధ్యక్షతన మధ్యాహ్నం 12.30 గంటలకు, 6వ  సంఘం (సాంఘిక సంక్షేమం) అధ్యక్షురాలు పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు జరుగుతాయని వివరించారు. అలాగే మార్చి 3,4న (విద్య, వైద్యం) అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు, 2వ సంఘం (గ్రామీణాభివృద్ధి) అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు, 7వ స్థాయీ సంఘం (పనులు) అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2గంటలకు, 1 స్థాయీ సంఘం (ఫైనాన్స్‌, ప్లానింగ్‌) అధ్యక్షుడు, జడ్పీచైర్మన్‌ పుట్ట మధూకర్‌ అధ్యక్షతన మధ్యాహ్న 3.30 గంటలకు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాలకు సంఘాల్లోని సభ్యులు, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకానితో పాటు సభ్యులైన  జడ్పీటీసీలు హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే స్థాయీ సంఘ సమావేశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సంబంధిత శాఖల అధికారులంతా హాజరుకావాలని కోరారు.logo