గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 27, 2020 , 00:09:50

పల్లె ప్రగతి పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి

పల్లె ప్రగతి పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి

పెద్దపల్లి రూరల్‌: పల్లెప్రగతిలో గుర్తించిన పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా ఆదేశించారు. పల్లెప్రగతి కార్యక్రమం పై బుధవారం అన్నిజిల్లాల కలెక్టర్లతో ఆయన హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారిశు ధ్యం, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలను అమలు చేయాలని అధికారుల ను ఆదేశించారు. గ్రామాలాభివృదికి రాష్ట్ర ప్రభు త్వం ప్రతి నెలా రూ.330కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తోందని, ఈ నిధులతో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదల, అభివృద్ధి కార్యక్రమాలు  చేపట్టాలని చెప్పారు. అలాగే దాతల సహకారం తీసు కోవాలని,  నిధులను సైతం వినియోగించుకుని గ్రామాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. ప్ర తి గ్రామంలో ట్రాక్టర్‌తోపాటు ట్రాలీ, ట్యాంకర్‌ సమకూర్చుకోవాలన్నారు. డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక నిర్మాణాలకు స్థలాలు లభించకపోతే అనువైన స్థలాలను గుర్తించి అవసరమైన చోట భూములను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత ఉండేలా చూడాలన్నారు.  నిర్మాణం పూర్తయిన ఇంకుడుగుంతల వి వరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్లపై చెత్త వేసేవారికి నోటీసు లు జారీ చేయాలని అధికారులకు తెలిపారు. అనంతరం జిల్లాలో నడుస్తున్న పట్టణ ప్రగతి వివరాలను సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా అమలు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ..  పల్లెప్రగతి నిరంతరం జరిగేలా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతున్నామన్నారు. ప్రతి వారంలో అధికారులు రెండురోజులు పల్లెని ద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా పరిధిలో 267 డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులు పూర్తి చేశామని, 255 శ్మశానవాటిక నిర్మా ణ పనులు ప్రారంభించామన్నారు. గ్రామీణ ప్రాం తాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి కాలేదని వివరించారు. 263 కొత్త ట్రాక్టర్లు, 37 ట్రాలీలు, 36 ట్యాంకర్లను గ్రామ పంచాయతీలకు అందించామ నీ, మిగిలిన గ్రామాలకు సైతం ట్రాక్టర్లు, ట్రాలీలు ట్యాం కర్లను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 24.96 లక్షల మొక్కలు నాటామని, అందులో 22.68 లక్షల మొక్కలను సంరక్షించి 91శాతం మేర మొక్కలు బతికేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపా రు. వీసీలో కలెక్టర్‌ వెంట రామగుండం కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయ ణ, జడ్పీ సీఈఓ వినోద్‌, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్‌, జిల్లా అటవీశాఖాధికారి రవిప్రసాద్‌ అధికారులు పాల్గొన్నారు. 


logo