బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 26, 2020 , 04:01:31

రేండోరోజు ఉత్సవాంగ

రేండోరోజు ఉత్సవాంగ

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం నగరాల, పట్టణాలను ప్రత్యేకంగా అభివృద్ది, సంక్షేమం బాట పట్టించేందుకు నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం రెండో రోజూ పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉత్సాహంగా కొనసాగింది. ప్రధానంగా ఆయా పట్టణాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాదయాత్రలు తీశారు. స్థానిక ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం నిర్వహణ, హరితహారం కింద మొక్కలు నాటడం, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు, విద్యుత్‌ సమస్యల గుర్తింపు వంటి పనులు చేశారు. వైకుంఠదామం, ఏకీకృత మార్కెట్‌, తదితర వాటి ఏర్పాటు కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.


కలియదిరిగిన ప్రముఖులు

రామగుండం నగరంలోని 15వ డివిజన్‌లో మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌తో కలిసి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పారిశుధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. అలాగే మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పలు డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు పట్టణ ప్రగతి కార్యక్రమ ప్రాధాన్యతను గురించి ప్రజలకు వివరించారు. అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీ ఆవరణలో పట్టణ ప్రగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో నల్లా కనెక్షన్‌ లేని ప్రతి కుటుంబానికి ఇకపై ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 


మున్సిపాల్టీ పరిధిలోని 1, 17, 18, 8తో పాటు పలు వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ దాసరి మమతారెడ్డి వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. మంథని మున్సిపాల్టీ పరిధిలోని 3వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డులు మున్సిపల్‌ చైర్మన్‌ ముత్యం సునీత ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాల్టీ ఆవరణలో జరిగిన పట్టణ ప్రగతి సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పాల్గొన్నారు. చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. ఇక ఆయాచోట్ల కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు వార్డుల్లో పాదయాత్ర నిర్వహించి, సమస్యలను గుర్తించడం, నిరక్షరాస్యులను గుర్తించే సర్వే, ఇంటింటికి కావాల్సిన మొక్కల కో సం సర్వే చేయడం, మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను గుర్తించడం,  పాత ఇంటి శిథిలాలు, వ్యర్థాల తొలగిం పు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేయడం, మురుగు కా ల్వలు శుభ్రం చేయడం వంటివాటికి శ్రీకారం చుట్టారు. 


అర్ధరాత్రి పర్యటన

మంథని టౌన్‌: మంథని పట్టణంలో మంగళవారం అర్ధరాత్రిబుల్లెట్‌ వాహనంపై జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శైలజ పర్యటించారు. ఈ సందర్భంగా వీధి దీపాలను పరిశీలించారు. వీరివెంట వైస్‌చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులున్నారు.logo