శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 26, 2020 , 03:55:45

బాధ్యతాయుతంగా పనిచేయాలి: కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

బాధ్యతాయుతంగా పనిచేయాలి: కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌


జిల్లాలో ఆహారభద్రత విషయంలో సంబంధిత అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలను మెరుగుపర్చాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు తరుచూ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ సమీక్షలు చేయాలని ఆదేశించారు. అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్య ధోరణి అవలంభించరాదని, బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.జిల్లా ఆహారభద్రతా సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ మాట్లాడుతూ, ఆహారభద్రత చట్టంపై ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహన పెంచాలన్నారు. జిల్లా సమస్యల పరిష్కార అధికారిగా ప్రభుత్వం ఇది వరకే డీఆర్‌డీఏ పీడీని డీజీఆర్‌ఓగా నియమించిందన్నారు. ఎవరైనా డీజీఆర్‌ఓకు ఆహారభద్రతా విషయంలో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. 30 రోజుల తర్వాత సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో కమిషన్‌ను ఆశ్రయించి అప్పీల్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు వెలువరించేలా తమవంతు కృషి చేస్తామని అన్నారు. 


శుభాకాంక్షలు.. ఫిర్యాదులు..

జిల్లా సమీక్ష సమావేశానికి హజరైన ఆహారభద్రత కమిషన్‌ సభ్యులకు జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగత శుభాకాంక్షలు తె లిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆహారభద్రత కమిషన్‌ సభ్యులకు రేషన్‌డీలర్లు, మధ్యాహ్న భో జన వర్కర్లు పలు సమస్యలపై వినతి పత్రాలు స మర్పించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, కమిషన్‌ సభ్యులు ములుకుంట్ల భారతి, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రవీ ణ్‌, జడ్పీ సీఈఓ వినోద్‌కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.


logo