బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 26, 2020 , 03:51:21

ఆహారభద్రత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

ఆహారభద్రత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

పెద్దపల్లి రూరల్‌: ఆహారభద్రతా చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆహారభద్రతా కమిషన్‌ సభ్యులు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కలెక్టర్‌ కా ర్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమక్షం లో సమీక్ష, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓరుగంటి ఆనంద్‌ మాట్లాడు తూ.. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు  అధి కారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు పాటుపడాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌ దుకాణాల్లో పనితీరు సక్రమంగా లేదనీ, అధికారుల పర్యవేక్షణ లేని మూ లంగా ఆహారభద్రలతా చట్టం సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. అంగన్‌వాడీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు నివేదిక 10రోజుల్లోగా అందించాలని కోరారు. 


అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందించాలని చెప్పారు. కాంట్రాక్టర్‌, ఏజెన్సీలు గుడ్డు సైజు తక్కువగా ఉన్నవి సరఫరా చేస్తే తిరస్కరించాలని స్పష్టంచచేశారు. జిల్లాలో 22, 391మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, 921మంది నిర్వాహకులతో రూ.1,000 గౌరవ భృతితో నడిపిస్తున్నామని డీఈఓ వివరించగా, క్షేత్రస్థాయిలో తనిఖీ లేని మూలంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటి ని సవరించాలని సూచించారు. జిల్లాలో ఆహారభద్రతా కార్డులు 2,16,744 ఉన్నాయని, 413 చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నామని జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేశం తెలుపగా, ప్రభుత్వం అందిస్తున్న బి య్యం సరిగా కార్డుదారులకు చేరడం లేదని అ లాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల ని సూచించారు. 


అంగన్‌వాడీలు శుభ్రంగా ఉంచాలి : రంగినేని శారద,  సభ్యురాలు

అంగన్‌వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేలా చూ డాలని తెలంగాణ ఆహారభద్రత కమిషన్‌ సభ్యురాలు రంగినేని శారద ఆదేశించారు. ప్రభుత్వం గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే చర్యలు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు జరగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంగన్‌వా డీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కేంద్రాల వద్ద మెను బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేస్తూ, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావారణంలో చదువుపై ఆసక్తి పెంచేలా చూడాలన్నారు. ఫిర్యాదుల బాక్స్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.


logo