బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 25, 2020 , 02:09:39

ప్రణాళికలు తయారు చేయాలి

ప్రణాళికలు తయారు చేయాలి

పెద్దపల్లిటౌన్‌: పెద్దపల్లి మున్సిపాలిటీ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. పట్టణంలోని 19వ వార్డు పరిధి బండారికుంటలో కలెక్టర్‌ మొక్కను నాటి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సో మవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  సీఎం కేసీఆర్‌ నాయకత్వం లో రూపుది ద్దుకున్న నూతన మున్సిపాలిటీ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీకి నియమించిన ప్రత్యేకాధికారి, కౌన్సిలర్ల సమన్వయంతో సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. కాలనీల్లో  వ్యర్థపదార్థాలను తక్షణ మే తొలగించాలని పిచ్చి మొక్కలు, తుమ్మ పొ దలు, ఖాళీ స్థలాల్లో ఉన్న అక్కరకు రాని మొక్కలను తొలగించాలని ఆదేశించారు. ప్రతి వార్డులో మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇంటింటికి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాలనీలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో అణువైన మొ క్కలు నాటి సంరక్షించాలని సూచించారు. రోడ్లు నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, వీధిదీపాలు, పబ్లిక్‌ టాయిలెట్స్‌కు కావాల్సిన అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.


పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించాలి

పెద్దపల్లి మున్సిపాలిటీలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఎక్కడ అవసరమో గుర్తించి వాటికి కావాల్సిన స్థ లాలను గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. డం పింగ్‌ యార్డులు, పబ్లిక్‌ జిమ్‌లు, వైకుంఠధామాలు, మార్కెట్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి పాల్గొన్నారు. 


ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి 

పెద్దపల్లి మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి తెలిపారు. 7వ వార్డు లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతనంగా రోడ్డు పనులను, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మమతారెడ్డి మాట్లాడుతూ,  36వ వార్డుల్లో ఒక్కో వార్డును ఒక యూనిట్‌గా చేసుకుని ప్రత్యేక అధికారి, వార్డు కౌన్సిలర్‌, ప్రజాప్రతి నిధులు, పొదుపు మహిళా, యువత, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించుకుని సమస్యల ప్రాధాన్యతలను బట్టి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 7వ వార్డులోని విద్యుత్‌ సమస్యలు, రోడ్డును పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దె, నూతన విద్యుత్‌ స్తం భాన్ని ప్రారంభించారు. 9, 10, 11 వార్డులో పట్టణ ప్రగతిపై వార్డుల్లో కౌన్సిలర్లు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. 18, 19, 20, 21, 34 వార్డుల్లో నూతన రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు బెక్కం అంజమ్మ, రేవెల్లి స్వామి, పూదరి చంద్రశేఖర్‌, కొలిపాక శ్రీనివాస్‌, మాధవి, ఎరుకల కల్పన, కొమిరిశెట్టి కనుకలక్ష్మి, నజియా సుల్తానాబేగం, మోబిన్‌, అస్రఫ్‌, విద్యుత్‌ శాఖ డీఈ లక్ష్మణరెడ్డి, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈలు ప్రకాశ్‌, రమేశ్‌, నాయకులు కృష్ణారెడ్డి, కొమురయ్య, కనుకయ్య, బెక్కం ప్రశాంత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మేనేజర్‌ నయీమ్‌షా ఖాద్రీ, టీపీఓ శ్రీధర్‌ప్రసాద్‌, ఆర్‌ఐ శివప్రసాద్‌తో పాటు పులిపాక రాజు, సతీశ్‌, అవినాష్‌రెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


పకడ్బందీగా అమలు చేయాలి 

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిపై పెద్దపల్లి మున్సిపల్‌ సమావేశ మందిరంలో సోమవారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్దపల్లిలోని 36వ వార్డుల్లో ప్రత్యేక అధికారులను నియమించాలనీ, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పాదయాత్రలు నిర్వహించాలని సూచించారు. మొదటి రోజు గుర్తించిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మేనేజర్‌ నయీమ్‌షా ఖాద్రీ, డీఈ లక్ష్మణ్‌రెడ్డి, టీపీఓ శ్రీధర్‌ప్రసాద్‌, అవినాష్‌రెడ్డి, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.


సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

సుల్తానాబాద్‌ : వినూత్నమైన పథకాలతో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ ప్రజల్లో గుండె ల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని సోమవారం 1 వార్డులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి వార్డులో కమిటీలను ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న, కావాల్సిన పనులను గుర్తించి వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. నూతనంగా రాజీ వ్‌ రహదారిని ఆనుకొని ఉన్న పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశామని చెప్పారు. 15 వా ర్డుల్లో మొదటి రోజు అధికారులతో కలిసి చేయాల్సిన ప నులను పరిశీలించారు. కార్యక్రమాల్లో తాసిల్దార్‌ హన్మంతరావు, పెద్దపల్లి డీఈఈ లక్ష్మారెడ్డి, ఏడీఈ  శ్రీనివాస్‌, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్లు పసెడ్ల మమత, గాజుల లక్ష్మి, రాజమల్లు, నిషాద్‌ ఖాతు న్‌, రఫిక్‌, పారుపెల్లి జ్ఞానేశ్వరి, గుణపతి, ఉట్ల వరప్రదీప్‌, కూకట్ల గోపి, చింతల సునీత, గొట్టం లక్ష్మి, మల్లయ్య, అనుమాల అరుణ, బాపురావు, రేవెల్లి తిరుపతి, దున్నపోతుల రాజయ్య, సిద్ద కనుకయ్య,  గుర్రాల శ్రీనివాస్‌, ఏఈ రవిచందర్‌ తదితరులు పాల్గొన్నారు.     


logo