గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 25, 2020 , 02:05:45

భూ సమస్యలు పరిష్కరించండి

భూ సమస్యలు పరిష్కరించండి

జ్యోతినగర్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న  భూ సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి నెలకొన్న పెండింగ్‌ భూ సమస్యలపై సోమవారం కలెక్టర్‌ ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని వీఐపీ అతిథి గృహంలో జడ్పీ చైర్మన్‌, రామగుండం ఎమ్మెల్యే, సీఎం ఒఎస్డీ, కాళేశ్వరం సీఈలతో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.  ప్రాజెక్ట్‌ పరిధిలోని బ్యారేజిలను క్రమ పద్దతిలో నీరు నిల్వ చేసే పరిక్షించామనీ, అలాగే, పంప్‌హౌస్‌లోని మోటార్ల సైతం పరీక్షించారనీ, పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్‌ పనులు సత్పలితాలు ఇస్తున్నట్లు కాళేశ్వరం సీఈ వివరించగా, ప్రాజెక్టులో బ్యారేజీలలో నీరు నిలిపే క్రమంలో బ్యాక్‌ వాటర్‌తో ముంపుకు గురైన పంట భూమి వివరాలను గుర్తించి వారికి పంట నష్టం అందించడానికి సీఎం ఆదేశాల మేరకు  అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను సూచించారు.  


కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో జిల్లా వ్యాప్తంగా మరో 633 ఎకరాల భూమి వివిధ దలో ఉన్నాయనీ, వీటిని నియమాల ప్రకారం వెంటనే చర్య తీసుకోవాలన్నారు. ప్రాజెక్ట్‌ పరిధిలో కొన్ని భూములు సేకరణ సమయంలో నమోదైన కోర్టు కేసులు త్వరగా ముగిసేలా అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ.. మంథని ప్రాంతంలో శివలింగం, శ్మశాసన వాటిక ముంపుకు గురవుతున్నాయనీ, మల్లారం, వెంకటాపూర్‌, ఖసాయన్‌పేట గ్రామాలలోని భూములకు పంట నష్టం జరిగిందని పరిహారం చెల్లించాలన్నారు. శ్మశాసన వాటిక నిర్మాణ పనులు, గోదావరి వంతెన నిర్మాణం పనులు చేపట్టాలన్నారు. అలాగే, సుందిళ్ల నుంచి ఆరెంద వరకు విద్యుత్‌ లైన్‌ను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ కోరారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బ్యాక్‌ వాటర్‌తో పంట పొలాలకు నష్టం వాటిళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడ కాళేశ్వరం ఈఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ మనోహర్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌ కుమార్‌, సంబంధిత అధికారులు ఉన్నారు. 


పరిహారం చెల్లించాలి..: ఎమ్మెల్యే చందర్‌ 

సుందిళ్ల  బ్యారేజీకి సంబంధించిన బ్యాక్‌ వాటర్‌తో మల్కాపూర్‌, జనగామ గ్రామాలలోని 160 ఎకరాలలో 20 ఎకరాలకు నష్టం  వాటిల్లిందనీ, సదరు రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు జనగామ రైతులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి, ఆ భూముల సేకరణ నిమిత్తం చెల్లించాల్సిన నష్టపరిహారంపై చర్చించాలని కోరారు.  బ్యాక్‌ వాటర్‌తో జనగామ, మల్కాపూర్‌ పంటపొలాల్లో నీరు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రైతులు కోరిన విధంగా  వారి పంట పొలాల్లో మట్టిని నింపాలనీ, మిగితా భూములకు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. అలాగే, గోదావరి నుంచి నీరు పంట పొలాల్లోకి రాకుండా ప్రోటినేషన్‌ నాలను నిర్మించాలన్నారు. గతంలో రామగుండం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలన్నారు. గత 17వ తేదిన జరిగిన ఇరిగేషన్‌ సమీక్ష సమావేశంలో కూడా తాను  ఈవిషయాన్ని ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ రైతాంగానికి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనీ, ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ మేరకు స్పదించిన జిల్లా కలెక్టర్‌, ఇరిగేషన్‌ ఈఎస్‌సీలు త్వరలోనే పరిష్కారించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.  


logo
>>>>>>