ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Feb 24, 2020 , 02:37:16

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

పారిశుధ్యంపై  ప్రత్యేక దృష్టిపెట్టాలి

సుల్తానాబాద్‌ రూరల్‌ : గ్రామాల్లో పారిశుధ్యంపై విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో రెండోరోజు గర్రెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్‌ పాల్గొన్నా రు. వివిధ శాఖల అధికారులు వారి వారి శాఖల పనితీరును కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో పారిశుధ్యం కోసం ట్రాక్టర్‌ కొనుగోలు చేయడంతోపాటు నాలుగు ట్రై సైకిళ్ల సహకారంతో చెత్త సేకరణ చేపడుతున్నట్లు వివరించారు. గ్రామంలో 1314.8 హెక్టార్లలో వరి సాగవుతున్నదనీ, 201 8 రబీ వివరాల ప్రకారం రైతుబంధు సొమ్ము వా రివారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు మం జూరు, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌, యువకులు, క్రీడాకారులకు, గ్రామస్తుల సౌకర్యార్థం జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో ఓపెన్‌ జిమ్‌ మంజూ రు చేయాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ వీరగోని సుజాత వినతి పత్రం అందించారు. అనంతరం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రతి గ్రామంలో వ్యవసాయశాఖాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 


ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అర్హతతో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, విద్యతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించామని, ఆ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని చెప్పారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సంచార ప్రదేశాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై కలెక్టర్‌కు గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఆర్డీఓ శంకర్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్‌, జడ్పీ సీఈఓ వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ప్రసాద్‌, డీఈ ఓ జగన్మోహన్‌రెడ్డి, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, ఎంపీడీఓ సంతోష్‌కుమార్‌, తాసిల్దార్‌ హన్మంతు, సర్పంచ్‌ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష, ఉప సర్పంచ్‌ మధుకర్‌, నాయకులు వీరగోని రమేశ్‌గౌడ్‌, పులి వెంకటేశం, వార్డుసభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo