మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 24, 2020 , 02:33:31

సంక్షేమమే సర్కారు లక్ష్యం

సంక్షేమమే సర్కారు లక్ష్యం

పెద్దపల్లి జంక్షన్‌ : ప్రజా సంక్షేమే తమ సర్కారు లక్ష్యమనీ, అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 248 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే ఆదివారం పంపిణీ చేశారు. పెద్దపల్లి మండల పరిధిలోని 32 మంది లబ్ధిదారులకు రూ.32,03,712 విలువ గల షాదీ ముబారక్‌ చెక్కులను స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. షాదీ ముబారక్‌ పథకం ద్వారా ముస్లీం ఆడబిడ్డ వివాహానికి ప్రభుత్వం రూ.1,00,116 అందిస్తున్నదని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, సీఎం కేసీఆర్‌ బడుగు బలహీన వర్గాల సంక్షే మం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. పేదంటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూతను అందించాలనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. రైతులకు బీమా చేయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేని తెలిపారు. ప్రభు త్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొందరు మధ్యవర్తులను నమ్మి ప్రజలు మోసపోతున్నారనే ఆరోపణలున్నాయనీ, సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని ఎమ్మెల్యే కోరారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సం ప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి, ఎంపీపీ బండారి స్ర వంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ నజ్మీన్‌ సుల్తానా, సింగిల్‌ విండో చైర్మ న్లు మాదిరెడ్డి నర్సింహరెడ్డి, గజవెల్లి పురుషోత్తం పాల్గొన్నారు.


కాల్వశ్రీరాంపూర్‌ : రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నలా మారారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ భివర్ణించారు. కాల్వశ్రీరాంపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయం లో 118 మందికి మంజూరైన రూ.1,18,13,688 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నలా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, పెళ్లి కానుకగా రూ.లక్ష చొప్పున అందిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేలా సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆరెపల్లి గ్రామ పరిధి మల్లయ్యపల్లికి చెందిన శ్రీమంతుల కవిత ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఇక్కడ తాసిల్దార్‌ కే వేణుగోపాల్‌, ఎంపీడీఓ జీ కిషన్‌, ఎంపీపీ నూనేటి సం పత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు గజవెల్లి పురుషోత్తం, చదువు రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి, ఎస్‌ఐ ప్రగతి, వైస్‌ ఎంపీపీ జూకంటి శిరీష, ఎంపీటీసీ మాదాసి సువర్ణ, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇబ్రహీం పాల్గొన్నారు. 


జూలపల్లి : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ఆడ బి డ్డల పెళ్లి ఖర్చుల కోసం సీఎం కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. మండలంలోని 98 మంది లబ్ధిదారులకు రూ.98,11,368 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక మండల ప్రజా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ అడక్కుండానే ఆసరా’ ఫించన్లు, పంట పెట్టుబడి, రైతు బీమా, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా అనేక మందికి ముఖ్యమంత్రి లబ్ధి చేకూర్చుతున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో పేదల స్థితిగతులను గమనించిన కేసీఆర్‌, ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్యాణలక్ష్మి పథ కం రూపొందించారని పేర్కొన్నారు. అన్ని వర్గాలనూ ఆదుకోడానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపా రు. సాగు, తాగు నీటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. ప్రజలంతా కేసీఆర్‌కు తోడు నీడలా ఉంటూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌, సర్పంచులు దారబోయిన నరసింహం, మేచినేని సంతోష్‌రావు, వీర్ల మల్లేశం, బంటు ఎల్లయ్య, పొలవేని వీరయ్య, కుంటూరి రాజయ్య, రేశవేని రాధ, ఎంపీటీసీలు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్‌, దండె వెంకటేశం, అమరగాని మమత, పల్లె స్వరూప, ధూళికట్ట సింగిల్‌ విండో అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్‌రావు, కోఆప్షన్‌ సభ్యుడు లాల్‌మహ్మద్‌, తాసిల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>