శనివారం 28 మార్చి 2020
Peddapalli - Feb 22, 2020 , 04:34:22

ఓం నమఃశివాయః

ఓం నమఃశివాయః

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఓం నమఃశివాయః.. హర హర మహాదేవ శంభో శంకర.. అంటూ అశేష భక్తజనం శివనామస్మరణలో మునిగిపోయింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మదినిండా పరమేశ్వరుడిని తలుచుకుంటూ.. పంచాక్షరీ మంత్రాన్ని పఠించింది. పండుగ సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆయాచోట్ల లింగోద్భవం.. శివ-పార్వతుల కల్యాణం కన్నుల పండువగా సాగింది. శివరాత్రి సందర్భంగా భక్తులు మంథని, గోదావరిఖని, సుందిళ్ల గోదావరి తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసాలు, జాగారాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మారం మండలం రచ్చపల్లి శ్రీ సాంబమూర్తి ఆలయంతోపాటు జనగామలోని పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ప్రత్యేక  పూజలు చేశారు. మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సీఎం కేసీఆర్‌ ఓఎస్‌డీ రాజశేఖర్‌రెడ్డి దంపతులు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ప్రత్యేక పూజలు జరిపించారు. 


logo