శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 22, 2020 , 04:30:51

పల్లెలు పచ్చబడాలి

 పల్లెలు పచ్చబడాలి

కలెక్టరేట్‌ : ప్రభుత్వ పథకాలను పక్కాగా అమ లు చేస్తూ, పల్లెల్లో పచ్చదనం పర్చుకునేలా తీర్చిదిద్దాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం నిట్టూరు, ఓదెల గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసి న ట్రాక్టర్లను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులకు అందజేశారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ట్రాక్టర్లకు పూజలు చేసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆరోగ్యవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దేందుకు పల్లె ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్‌ పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో హరితహా రం మొక్కల సంరక్షణ, పారిశుధ్య పనుల కోసం పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 


ప్రజాప్రతినిధులు కూడా గ్రామాలాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పని చేస్తేనే సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానంలో భాగమైన బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. తెలంగా ణ బిడ్డలుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జీ రఘువీర్‌సింగ్‌, నాయకులు జిన్నా రాంచంద్రారెడ్డి, కొంజర్ల వెంకయ్య, మాదారపు వేణుగోపాల్‌రావు, ఆరెపల్లి వెంకట్రాజం, బండ బాబురావు, అల్గువెల్లి కృష్ణారెడ్డి, ఆకుల మహేందర్‌, ఆకుల శ్రీనివాస్‌, దేవరనేని సంపత్‌రావు, గిర్నేని రాజేశ్వర్‌రావు, బోడకుంట కుమారస్వామి, పల్లె కుమార్‌, ఈ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo