శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 22, 2020 , 04:35:07

మహాలక్ష్మి సన్నిధిలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి

మహాలక్ష్మి సన్నిధిలో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి

మంథనిటౌన్‌ : పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొ ని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆలయానికి చేరుకున్న రాజశేఖర్‌రెడ్డికి వేదపండితులు అవధానుల శ్రీకాంత్‌, మారుపాక ప్రశాంత్‌, ఓజ్జల గణేశ్‌ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశేఖర్‌రెడ్డి దంపతులను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, కౌన్సిలర్లు గర్రెపల్లి సత్యనారాయణ, వీకే రవి, కుర్ర లింగయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్‌ ఆకుల రాజబాపు, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, ఎక్కటి ఆనంతరెడ్డి, బత్తుల సత్యనారాయణ, డిగంబర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo