గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 21, 2020 , 06:11:08

మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం

మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం

మంథని మున్సిపాల్టీని మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతామనీ, హైదరాబాద్‌ నగరంగా అభివృద్ధి చేస్తామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ ఆధ్వర్యంలో నూతనంగా పట్టణంలో ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ, డెకరేషన్‌ లైట్లను స్థానిక పాత పెట్రోల్‌ పంపు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి పుట్ట మధు ప్రారంభించారు.

  • హైదరాబాద్‌ నగరం మాదిరిగా మంథని పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం
  • జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • మున్సిపల్‌ పరిధిలో ఎల్‌ఈడీ, అలంకరణ లైట్లు ప్రారంభం

  మంథనిటౌన్‌: మంథని మున్సిపాల్టీని మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతామనీ, హైదరాబాద్‌ నగరంగా అభివృద్ధి చేస్తామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ ఆధ్వర్యంలో నూతనంగా పట్టణంలో ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ, డెకరేషన్‌ లైట్లను స్థానిక పాత పెట్రోల్‌ పంపు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి పుట్ట మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంథనికి కొత్త శోభ తీసుకువచ్చేందుకు ఎల్‌ఈడీ, డెకరేషన్‌ లైట్లను ఏర్పాటు చేసిన చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, పాలకవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్‌కు పెండింగ్‌ ఆప్రూవల్‌ ద్వారా మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి లైట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారన్నారు. పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడుతున్నామని ఉద్ఘాటిం చారు. హైదరాబాద్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అలాంటివి ఇక్కడ అతిత్వరలో అందిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మంథని మున్సిపల్‌ కౌన్సిలర్లు కాయితీ సమ్మయ్య, శ్రీపతి బానయ్య, కుర్రు లింగయ్య, కొట్టె పద్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, ఎక్కటి అనంతరెడ్డి, బత్తుల సత్యనారాయణ, వేల్పుల గట్టయ్య పాల్గొన్నారు. అలాగే ముత్తారం మండలంలోని దర్యాపూర్‌, ఇప్పలపల్లి, సీతంపేట జీపీలకు చెందిన చెత్త సేకరణ ఆటో ట్రాలీలను మంథనిలో పుట్ట మధూకర్‌ ప్రారంభిచారు. 


logo