బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 21, 2020 , 06:09:50

పల్లెల అభివృద్ధే ప్రధాన ధ్యేయం

పల్లెల అభివృద్ధే ప్రధాన ధ్యేయం

అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలనీ, ఇందుకు అందరిని భాగస్వాములను చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామ పంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను దాసరి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు.

  • గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
  • పరిశుభ్రతకుపెద్దపీట వేయాలి
  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • మారేడుగొండ, అబ్బిడిపల్లికి ట్రాక్టర్‌, ఆటో ట్రాలీ అందజేత

కలెక్టరేట్‌: అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలనీ, ఇందుకు అందరిని భాగస్వాములను చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామ పంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను దాసరి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ట్రాక్టర్ల కొనుగోలుకు శ్రీకారం చు ట్టారని అన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపేట వేయాలని చెప్పారు. గ్రామ పంచాయతీలకు ప్ర భుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. కార్యక్రమంలో పెద్దపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్‌ కన్నం జయ్‌, ఎంపీటీసీ మాదిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌,  బోగం శ్రీనివాస్‌, మద్దెల పోచాలు, సదయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఫీల్డ్‌అసిస్టెంట్‌ రవి తదితరులు పాల్గొన్నారు. 


ఓదెల: గ్రామాల్లో స్వచ్ఛత నెలకొల్పేవిధంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. అబ్బిడిపల్లి గ్రామపంచాయతీ వారు కొనుగోలు చేసిన ఆటో ట్రాలీని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. జీపీలు కొనుగోలు చేసిన వాహనాలతో ఎప్పటికప్పుడు గ్రామాలను శుభ్రంగా ఉండేట్లు చూడాలన్నారు. కొత్తగా ఏర్పడిన అబ్బిడిపల్లె గ్రామంలో జరుగుతున్న స్వచ్ఛత పనులపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్‌ కోమలతను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఒజ్జె కోమలత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కావటి రాజు, ఉపసర్పంచ్‌ తంగెళ్ల నర్సింహారెడ్డి, కార్యదర్శి సదయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. logo
>>>>>>