శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 21, 2020 , 06:04:38

పేదల కండ్లలో ఆనందమే లక్ష్యం

పేదల కండ్లలో ఆనందమే లక్ష్యం

పేదల కండ్లల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకుసాగుతున్నారని రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. గురువారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలానికి చెందిన 49 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సంబంధించి రూ.49లక్షల 5వేల 684ల చెక్కులను ఆయన అందజేశారు.

  • కల్యాణ లక్ష్మితో ఆడబిడ్డల కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్‌
  • ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
  • ఖనిలో పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: పేదల కండ్లల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకుసాగుతున్నారని రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. గురువారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలానికి చెందిన 49 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సంబంధించి రూ.49లక్షల 5వేల 684ల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కల్యాణ లక్ష్మితో పథకంతో ఆడబిడ్డల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని కొనియాడారు.  కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్‌ శ్రీనివాస్‌, సహకార సంఘం చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, కార్పొరేటర్లు సాగంటి శంకర్‌, కుమ్మరి శ్రీనివాస్‌, అడ్డా ల గట్టయ్య, నాయకులు బొడ్డు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo