ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Feb 20, 2020 , 01:32:10

కమనీయం.. రమణీయం

 కమనీయం.. రమణీయం


ఓదెల: మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. జడ్పీటీసీ గంట రాములు, వైస్‌ఎంపీపీ పల్లె కుమార్‌, నాయకులు స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు ప్రజాప్రతినిధులు, వివిధ దూరప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. ఉదయం దృష్టికుంభము, బలిహరణ విధి, గణపతిపూజ, శివపుణ్యాహవచనం, గౌరీపూజ, రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజారోహణ, శివయాగ మంటపస్థాపన రుద్రహవనం తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. 11గంటలకు స్వామి వారి కల్యాణం ప్రారంభమైంది. దాదాపు మూడుగంటల పాటు కల్యాణ తంతును వేదపండితులు శాస్ర్తోత్తంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారికి ఆలయం తరపున ప్రసాదం, కండువాలు, జాకెట్‌ వంటివి పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ జూనియర్‌ అసిస్టెంట్‌ ముద్దసాని కుమారస్వామి, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌, ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి, ఉపసర్పంచ్‌ తీర్తాల కుమార్‌, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కల్యాణాన్ని వేదపండితులు దూపం వీరభద్రయ్య, మఠం భవానీప్రసాద్‌, పంచాక్షరి, మఠం భద్రయ్య, మహంతయ్య, అంగడిమఠం భువనేశ్వర్‌, శ్రీశైలం, వేద విద్యార్థులు నిర్వహించారు.


logo