గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 19, 2020 , 02:54:39

‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం

‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై మేయర్‌, మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దే శం చేశారు. పట్టణ ప్రగతి కార్యాచరణపై వివరిస్తూ ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని ఆదేశించారు. సీఎంతో సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, రామగుండం మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు చిట్టిరెడ్డి మమతారెడ్డి, పుట్ట శైలజ, ముత్యం సునిత, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పాల్గొన్నారు.  

పట్టణ ప్రగతి కార్యాచరణ 

ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఆ మేరకు వివరాలివి..

  యూనిట్‌గా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డుల వారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యత కోసం చర్యలు చేపట్టాలి. 

  ప్రతి మున్సిపాలిటీలో వార్డులు, డివిజన్ల వారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ వచ్చే ఐదు రోజుల్లో పూర్తి కావాలి. 

  ప్రగతిలో పచ్చదనం-పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

  డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురుగునీటి గుంతలను పూడ్చివేయాలి.  

  ప్రణాళిక రూపొందించాలి. విరివిగా మొక్కలు నాటాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. 

  కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుకోవాలి. 

  తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి.

  ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలను పూడ్చివేయాలి. 

  ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలి.

  తుమ్మలను నరికి వేయాలి.

  మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకొని, వాటికోసం స్థలాలను ఎంపిక చేయాలి.

 శుకీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు 

ఏర్పాటు చేయాలి.

  ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలి.

  టాయిలెట్స్‌ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. వీటికోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. 

  వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపే దాకా వారిని ఇబ్బంది పెట్టవద్దు. 

  స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటు చేయాలి.

  విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతులు అవలంబించాలి. ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థ ఉండాలి. వంగిన, తుప్పు పట్టిన స్తంభాలను, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లను మార్చివేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. 

ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఈ నెల 24నుంచి చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి, ఎమ్మెల్యేలు, మేయర్‌, మున్సిపల్‌ అధ్యక్షులు జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మం థని, సుల్తానాబాద్‌ల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమాయత్తమయ్యారు. 

అవితీనిని అంతమొందించండి

‘ఐదు కోట్ల మంది ఉన్న తెలంగాణలో 140 మందికే చైర్‌పర్సన్లుగా అవకాశం లభించింది. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. అవినీతిని అంతమొందించి నిస్వార్థంగా సేవ చేసి ప్రజా నాయకులుగా ఎదగండి. పదవి అంటే ఒక అధికారం కాదు.. అదొక అసిధార వ్రతం”..అంటూ మున్సిపల్‌ అధ్యక్షులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్తవ్యబోధ చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పల్లె ప్రగతి కార్యాచరణను వివరించడంతో పాటు దిశా నిర్దేశం చేశారు. పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలంటేనే ప్రజా సమూహంలో లంచగొండులు, చెత్తా చెదారమనే పేరు పడిపోయిందని, దీన్ని రూపుమాపేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రజా శక్తి అన్నింటికంటే ఉత్కృష్టమైందనీ, దాన్ని సమీకృతం చేయగలిగితే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. పట్టణ ప్రగతిని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలనీ, ఆరు నెలల పాటు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ పౌరులు సమష్టిగా కృషి చేస్తే అందమైన నగరాలు కళ్లెదుట సాక్షాత్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.  


logo
>>>>>>