శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 19, 2020 , 02:48:50

సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

ధర్మారం: ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశానుసారం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం సూచించారు. మంత్రి ఆదేశంతో మంగళవారం ధర్మారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం ఆవరణలో రాజేశం అధ్యక్షతన  సమావేశాన్ని చేపట్టారు. ఈ సమావేశానికి ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూరు పద్మజ హాజరయ్యారు. అనంతరం రాజేశం మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, పార్టీని గ్రామాల్లో మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ నియమాలు, నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసే వారిపై తీసుకోను న్న చర్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈశ్వర్‌ ప్రత్యేక కృషితో ఎంపీ, శాసన సభ, పంచాయతీ, పరిషత్‌, బల్దియా, సహకార సంఘాల ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.  ఈ క్రమంలో పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులతోపాటు నాయకులంతా కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ ప్ర జాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని సూచించారు. పార్టీలో ఉంటూ అంతర కలహాలు వెన్నుపోటు దారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారని  తెలిపా రు. గ్రామస్థాయిలో నాయకులు అంతర్గత  సమస్యలు చ ర్చించుకొని పరిష్కరించు కోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిని అంటూ సొంత ఏజెండాను పెట్టుకుని వ్యక్తులను విమర్శిస్తూ, పలువురి టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియా వేదిక ధర్మారానికి చెందిన దేవి జనార్దన్‌ ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. మంత్రి ఆదేశం మేరకు జనార్దన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయనపై తీర్మానం ప్రవేశ పెట్టి ప్రకటించగా, నాయకులు, కార్యకర్తలు ఆమోదించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, పార్టీలో అంతర్గత సమస్యలు ఉం డకుండా అందరం కలిసి ఉందామని వివరించా రు. సమస్యలు ఉంటే అంతర్గ తంగా చర్చించుకుంటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. జడ్పీ సభ్యురాలు మాట్లాడుతూ, తాను మండల ప్రజల ఆదరణతో జడ్పీ సభ్యురాలుగా ఎన్నికయ్యానని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు. ఒకరి స్వార్థం కో సం పార్టీని ఫణంగా పెట్టవద్దని అన్నారు.  సమావేశంలో  వైస్‌ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గూడూరి లక్ష్మణ్‌, నంది మేడారం, పత్తిపాక సింగిల్‌ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట రెడ్డి, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పాకాల రాజయ్య, జిల్లా, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ సలామొద్దీన్‌, ఎండీ రఫీ, పార్టీ పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతి రావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,  సీనియర్‌ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


logo