బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 19, 2020 , 02:31:12

పర్యటిస్తూ.. పనులు పరిశీలిస్తూ..

పర్యటిస్తూ.. పనులు పరిశీలిస్తూ..

జూలపల్లి : మండలంలోని నాగులపల్లి, తేలుకుంట గ్రామాల్లో మంగళవారం కేంద్ర బృందం సభ్యులు సుశీల్‌కుమార్‌, శ్రీకుట్టి, లక్ష్మి పర్యటించి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈజీఎస్‌ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రామ పంచాయతీల రికార్డులు, అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక మరుగుదొడ్లు, పశువుల పాకలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యారుల్డు, మొక్కల పెంపకం కేంద్రాలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు తనిఖీ చేశారు. నాగులపల్లి శివారులో మల్లన్న గుట్టల్ని సందర్శించారు. శ్రీనిధి బ్యాంక్‌ ద్వారా రుణాలు తీసుకుని ఉపాధి పొందు తున్న తేలుకుంట చేనేత కార్మికుల మగ్గాలు పరిశీలించారు. స్వశక్తి మహిళల సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు అడిగి తెల్సుకున్నారు. తెలంగాణ ఆసరా పింఛన్ల గురించి లబ్ధిదారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో సర్పంచులు పొలవేని వీరయ్య, సొల్లు పద్మ, ఉప సర్పంచులు చొప్పరి నర్సింగం, అంజయ్య, అడిషనల్‌ డీఆర్‌డీఓ సునీత, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ రాఘవులు, ఎంపీడీఓ వేణుగోపాల్‌రావు, ఎంపీఓ రమేశ్‌, పీఆర్‌ ఏఈ సుమలత, ఏపీఓ సదానందం, ఏపీఎం తులసీమాత, పంచాయతీ కార్యదర్శులు లచ్చయ్య, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

20న  పర్యటన

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో ఈ నెల 20 తేదీన కేంద్ర బృందం పర్యటించనుందని ఎంపీడీఓ కిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగం తీరుపై ఈ నెల 20న కిష్టంపేట, గంగారం, 22న మల్యాల, పెద్దరాతుపల్లి గ్రామాల్లో బృందం పర్యటించనుందని వివరించారు. కార్యక్రమానికి ఆయా గ్రామాల గ్రామస్థాయి అధికారులు సకాలంలో హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు. 


logo