సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Feb 18, 2020 , 02:24:06

జన హృదయనేతకు హరిత కానుక

జన హృదయనేతకు హరిత కానుక

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ 66వ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ప్రజలు కేకులు కట్‌ చేసి కేసీఆర్‌కు ఇష్టమైన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లాలో అధికారులు శాఖలవారీగా మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గులాబీ శ్రేణులు కూడా నియోజకవర్గాలవారీగా కేక్‌ కట్‌ చేసి సంబురాలు చేసుకోగా, మరికొన్ని చోట్ల వృద్ధులు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. 


అట్టహాసంగా వేడుకలు.. 

 ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో మండలి విప్‌ తానిపర్తి భానుప్రసాదరావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మొక్కలు నాటారు. అలాగే మంథని మున్సిపాల్టీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ హరితహారం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌ చేసి స్వీట్లు పంచారు. ఇక్కడ పట్టణంలోని పలు పేద కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వినూత్నంగా కేసీఆర్‌ బర్త్‌డే నిర్వహించారు. ఎమ్మెల్యే చందర్‌ ఆధ్వర్యంలో 66మంది టీబీజీకేఎస్‌ కార్యకర్తలు, 66మంది సీనియర్‌ సిటిజన్లు, 66మంది విద్యార్థులు, 66మంది మహిళలు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాస్కులు ధరించారు. 66 కిలోల భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే చందర్‌ 6 నిమిషాల్లో 66 మొక్కలు నాటారు. ఇక ఓదెల మండలం గోపరపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారంలో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. 


అలాగే మేయర్‌ మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు ఆధ్వర్యంలో రామగుండంలో, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ చిట్టిరెడ్డి మమతారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ఆధ్వర్యంలో మంథనిలో, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ముత్యం సునీతల ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో వేడుకలు జరిపారు. జూలపల్లిలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ కార్యాలయం ఆవరణలో డీసీపీ పులిగిల్ల రవీందర్‌, కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ మొక్కలు పెట్టారు. ధర్మారం మండలంలో ఎంపీపీ కరుణ, జడ్పీటీసీ పద్మజల ఆధ్వర్యంలో,  ఎంపీపీ రమాదేవి, ముత్తారంలో ఎంపీపీ ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత ఆధ్వర్యంలో, రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క ఆధ్వర్యంలో వేర్వేరుగా వేడుకలను నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు సైతం హరితహారాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు.logo