బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 17, 2020 , 02:35:02

కేసీఆర్‌కు బర్త్‌డే కానుకగా ఈ గెలుపు

కేసీఆర్‌కు బర్త్‌డే కానుకగా ఈ గెలుపు

అంతర్గాం : రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బర్త్‌డే కానుకగా సహకార సంఘం గెలుపును కానుకగా అందిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. మేడిపల్లి ప్రాథమిక వ్వయసాయ సహకార సంఘం చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌గా ధర్ని పోచయ్య ఆదివారం ఏకగ్రీవ ఎన్నిక అనంతరం డైరెక్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రైతాంగం కష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు చూసామనీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్వపరిపాలనలో రైతులను రాజులుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ రైతులకు ఉచిత కరెంటు, రైతుకు పంట పెట్టుబడి సాయం, రైతు బీమా లాంటి బృహత్తరమైన పథకాలను అందించడంతోపాటు వృథాగా పోతున్న గోదావరి నీళ్లను అపర భగీరథ ప్రయత్నంలో ప్రతిష్టాత్మకమైన కాళేవ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతు బాంధవుడయ్యాడరన్నారు.


సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలనను చూసి నేడు ప్రజలు గులాబీ పార్టీని గుండెలకు హత్తుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, ఎంపీపీలు దుర్గం విజయ, వ్యాల అనసూర్య రాంరెడ్డి, వైస్‌ ఎంపీటీసీ కొలిపాక శరణ్య రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం సంఘం కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. 


logo
>>>>>>