శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 16, 2020 , 02:45:09

‘సహకారం’లో కారు జోరు

‘సహకారం’లో కారు జోరు

సహకార ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి దాసరి మనోహర్‌రెడ్డి పక్కా  వ్యూహంతో అభ్యర్థులు గెలుపొందారు. గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలో సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాల్వశ్రీరాంపూర్‌ పీఏసీఎస్‌ ఎన్నికల్లో 2డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా 11 స్థానాలకు ఎన్నికల్లో 1462 ఓట్లకు 1315 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోగా,  90శాతం పోలింగ్‌ నమోదైంది. కూనారం సహకార సంఘం ఎన్నికల్లో 13 డైరెక్టర్‌ స్థానాలకు 6 ఏకగ్రీవం కాగా, 7 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 343 ఓట్లకు 308 మంది తమ హక్కు వినియోగించుకోగా,  90శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు రామగిరి సుదర్శనం, వై రమేశ్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలను పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌, సుల్తానాబాద్‌ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రగతి, ఏఎస్‌ఐ రామలక్ష్మి, పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాలను పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌కుమార్‌, తాసిల్దార్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. కాల్వశ్రీరాంపూర్‌ పీఏసీఎస్‌ పరిధిలో 8 మంది టీఆర్‌ఎస్‌, 6 మంది కాంగ్రెస్‌ మద్దతు దా రులు గెలుపొందారు. ఒక్క స్థానం నుంచి బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు.


టీఆర్‌ఎస్‌లో చేరిన డైరెక్టర్లు

కాల్వశ్రీరాంపూర్‌ పీఏసీఎస్‌లో గెలిచిన చదువు రాంచంద్రారెడ్డి, కేతుపెల్లి నర్సింహారెడ్డి ఎమ్మెల్యే దాసరి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మనోహర్‌రెడ్డి కండువా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కాల్వశ్రీరాంపూర్‌ సహకార సంఘం చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 

జూలపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు శనివారం ప్రశాంతంగా నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎస్‌ఐ శీలం లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, 7 నియోజక వర్గాల్లో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 776 మంది ఓటర్లలో 599 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 77 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, ప్రవాస భారతీయుడు గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి వేర్వేరుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, తాసిల్దార్‌ శ్రీనివాసరావు వేర్వేరుగా సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును ఓటర్లను అడిగి తెల్సుకున్నారు.  ఆదివారం ఉద యం 9 గంటలకు సంఘం కార్యాలయంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహి స్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్య ర్థులు, అభిమానులు పెద్దయెత్తున పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. 


ఎలిగేడు మండలంలో

ఎలిగేడు(జూలపల్లి) : ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఇక్కడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సంఘంలోని 13 డైరెక్టర్‌ స్థానాల్లో ఇప్పటికే 5 స్థానాలు ఏకగ్రీవం కాగా, 8 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 749 మంది ఓటర్లలో 620 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, 85 శాతం పోలింగ్‌ నమోదైంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎలిగేడులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ తర్వాత ఎన్నికల సిబ్బంది పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. 

పొత్కపల్లిలో..

ఓదెల: మండలంలోని పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ 13 నియోజక వర్గాలు ఉండగా, టీఆర్‌ఎస్‌ బలపర్చిన వారు ఏడుగురు గెలవగా, కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన వారు ఆరుగురు గెలిచారు. 4వ నియోజకవర్గం నుంచి గెలిచిన కాంతాల సమ్మిరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ క్యాంపునకు తరలి వెళ్లడంతో ఆ పార్టీ బలం ఎనిమిదికి పెరిగింది. మండలంలోని 22 గ్రామాలకు ఒకే సహకార సంఘం ఉండగా రెండోసారి కూడా టీఆర్‌ఎస్‌ గెలిచి మరో మారు పట్టు సాధించింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పొత్కపల్లి సహకార సంఘంపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహత్మకంగా వ్యవహరించడంతో మెజార్టీ స్థానాలకు గెలుచుకోగలిగింది. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.  రిటర్నింగ్‌ అధికారి నరేంద్రాచారి తెలిపారు. ఇక్కడ 2205మంది ఓటర్లు ఉండగా 1788 మంది ఓటు వేశారు. 81శాతం పోలింగ్‌ జరిగింది. పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌, సుల్తానాబాద్‌ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, పొత్కపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చేశారు. పోలింగ్‌ ప్రశాం తంగా జరిగేట్లు ఏర్పాట్లు చేశారు. సహకార ఎన్నికల్లో వృద్ధులు, వివిధ పట్టణాల్లో ఉండే రైతులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.      


పెద్దపల్లి, అప్పన్నపేట పీఏసీఎస్‌లు..

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి, అప్పన్నపేట పీఏసీఎస్‌లకు శనివారం ఎన్నికలు నిర్వహిం చారు. పెద్దపల్లి పరిధిలోని 4  నియోజకవర్గ స్థానాలు, అప్పన్నపేట పరిధిలోని 9  స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దపల్లి పీఏసీఎస్‌ పరిధిలో ఎన్నికలు నిర్వహించిన 9 నియోజకవర్గాలకు 1244 ఓట్లు ఉండగా 980 ఓట్లు పోలవగా 78.77 శాతం ఓటింగ్‌ నమోదైంది. అప్పన్నపేట పీఏసీఎస్‌ పరిధిలోని ఎన్నికలు నిర్వహించిన 4 నియోజకవర్గాల పరిధిలో 500 ఓట్లు ఉండగా 382 ఓట్లు పోలవగా 76.8 శాతం ఓటింగ్‌ నమోదైంది.  


పోలింగ్‌ కేంద్రం పరిశీలన

పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట జడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల సరళిని శనివారం పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌కుమార్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి పరిసరాలను పరిశీలించారు.  ఆర్డీఓ వెంట తాసిల్దార్‌ శ్రీనివాస్‌, ఎన్నికల అధికారి రాంరెడ్డి, ఆర్‌ఐ భవానిప్రసాద్‌ ఉన్నారు. 


గులాబీ శ్రేణుల సంబురాలు

పీఏసీఎస్‌ ఎన్నికల్లో గులాబీ గుబాలించడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందంతో  కేరింతలు కొడు తూ రంగులు ఒక్కరిపై ఒక్కరు చల్లుకున్నారు. ఈ సంద ర్భంగా పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. పెద్దపల్లి మండలంలోని రెండు పీఏసీఎస్‌లలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే విజయకేతనం ఎగురవేయడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పెద్దపల్లి పీఏసీఎస్‌ పరిధిలోని 13నియోజకవర్గ స్థానాలకు 12, అప్పన్నపేట పీఏసీఎస్‌ పరిధిలోని 13 నియోజకవర్గ స్థానాలకు 11 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడంతో  ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు. అదే విధం గా డైరెక్టర్లుగా గెలిచిన అభ్యర్థులకు పూలమాలలు వేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కొలిపాక శ్రీనివాస్‌, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, ఆంజనేయరావు, కొలిపాక చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 


సుల్తానాబాద్‌లో విజయం

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌ సొసైటీలో 13 నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన 12 మంది అభ్యర్థులు గెలుపొందారు. 13 నియోజవర్గాల్లో ముందుగానే 4 స్థానాలను ఏకగ్రీవంగాకాగా, శనివారం నిర్వహించిన 9 స్థానాల్లో 8 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా 5వ స్థానం నుంచి పన్నాల రాముల కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారి నర్సిం గం తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  


logo