మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 16, 2020 , 02:43:10

ప్రభుత్వ పథకాలే పట్టంగట్టాయి

 ప్రభుత్వ పథకాలే పట్టంగట్టాయి

కలెక్టరేట్‌ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలే ప్రాథమిక, సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పట్టం కట్టాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జరిగిన సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు అ త్యధిక స్థానాలను కైవసం చేసుకోగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయం వద్ద విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ కర్షకుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. దీంతో రైతుంలతా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులనే గెలిపించుకోవాలన్న కాంక్షతో నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో భారీ మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు కూడా చేయని విధంగా రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పట్టం కట్టారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలు, రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచిన డైరెక్టర్లు పని చేయాలని కోరారు. 


టీఆర్‌ఎస్‌ సంబురాలు..

సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించడంతో శనివారం పార్టీ శ్రేణులంతా సంబురాలు జరుపుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 13 సహకార సంఘాల్లో ఎలిగేడు మండలం ధూళికట్ట ప్రాథమిక సహకార సంఘం ఏకగ్రీవం కాగా, మిగతా 12 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 12 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలోని మెజార్టీ డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొం ది, 12 సంఘాలను కైవసం చేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. ఎ న్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు, చైర్మన్‌ అ భ్యర్థిత్వం ఆశించేవారంతా జిల్లా కేంద్రంలోని దా సరి క్యాంపు కార్యాలయానికి చేరుకుని విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు తినిపించి సన్మానించారు. 


టీఆర్‌ఎస్‌లో చేరికలు..

పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ సహకార సంఘాల పరిధిలో డైరెక్టర్లుగా గెలుపొందిన పలువురు శనివారం ఎమ్మెల్యే దాసరి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని 9వ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మెట్టు సమ్మయ్యగౌడ్‌, 13వ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఈదునూరి జయపాల్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌ సహకార సం ఘంలో డైరెక్టర్లుగా గెలుపొందిన చదువు రాంచంద్రారెడ్డి, కేతుపల్లి నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలను పక్కనబెట్టి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కాం క్షించి టీఆర్‌ఎస్‌తో ఉండాలని వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు నూనేటి సంపత్‌ యాదవ్‌, బాలాజీరావు, జడ్పీటీసీలు బం డారి రామ్మూర్తి, వంగళ తిరుపతిరెడ్డి, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, రాంచంద్రారెడ్డి, రాంరెడ్డి, కరుణాకర్‌, శ్రీగిరి శ్రీనివాస్‌, గుర్రాల మల్లేశం, ఐల రమేశ్‌, కొలిపాక శ్రీనివాస్‌, సలేంద్ర రాములు, ఉప్పు రాజు, చొప్పరి సంపత్‌కుమార్‌, మాదారపు ఆంజనేయరావు, మేకల కుమార్‌, కీర్తి రాజయ్య, హబీబ్‌ ఉర్‌ రెహమాన్‌, వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, దాసరి చంద్రారెడ్డి, మాదిరెడ్డి నర్సింహారెడ్డి, చీకటి పోచాలు, ఉప్పు రాజ్‌కుమార్‌, శివ పటేల్‌, పడాల అజయ్‌, ముత్యం రమేశ్‌, తంగెళ్ల సంజీవరెడ్డి, ఈదునూరి వెంకటి, ఈదునూరి జాన్‌ తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>