మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 16, 2020 , 02:47:21

మాది రైతు ప్రభుత్వం

మాది రైతు ప్రభుత్వం

మంథనిటౌన్‌ : సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం, నిరంతరం రైతుల మేలు కోరే లా పనిచేస్తున్నదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. సింగిల్‌ విండో ఎన్నికల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రంలో పుట్ట మధూకర్‌ శనివారం ఓటు హ క్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్షకుల సం క్షేమం, అభివృద్ధి కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రై తు సమన్వయ సమితిలను స్థాపించారని గుర్తు చే శారు. సింగిల్‌ విండోల ద్వారా రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగానే గతంతో పోలిస్తే ఈ యేడు రైతుల పంటలు మూ డింతలు పెరిగాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సాగు నీరు అందించడంలో సఫలమైంద నీ, ఫలింతంగా పంట దిగుబడులు పెరిగాయని పే ర్కొన్నారు. వీటి కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకొని, రైతులకు గిట్టుబాటు ధర కల్పి స్తూ శ్రమ లేకుండా చేస్తున్నదని తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రైతులంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని చెప్పారు. 


సింగిల్‌ విండో కార్యాలయాల నిర్వాహ ణ గతంలో మాదిరిగా కేవలం కొనడం, అమ్మడ మే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్లాలని సూచించారు. ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సింగిల్‌ విండో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని రైతులు ఆలోచిస్తున్నారనీ, ఓటింగ్‌ సరళి ద్వారానే వారి ఆలోచన అర్థమవుతున్నదని పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని  ఎనిమిది సింగిల్‌ విండో స్థానాల్లో ఎనిమిదింటినీ టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా విజయం సాధించిన సింగిల్‌ విండో డైరెక్టర్లందరికీ పుట్ట మధూకర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట ఎంపీపీ కొండ శంకర్‌, టీ ఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కటి అనంతరెడ్డి, బత్తుల సత్యనారాయణ, శ్రీపతి బానయ్య, వీకే రవి, మాచీడి రాజుగౌడ్‌, ఆకుల కిరణ్‌ ఉన్నారు. 


టీఆర్‌ఎస్‌లో చేరిక..

కమాన్‌పూర్‌ :  రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన ముస్కుల పాపిరెడ్డి శనివారం జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సింగిల్‌విండో పరిధిలోని 5వ నియోజకవర్గంలో పాపిరెడ్డి భార్య ముస్కుల వీరలక్ష్మి ఏకగ్రీవం కాగా, టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కమాన్‌పూర్‌ మాజీ మండలాధ్యక్షుడు దాసరి రాజలింగు ఆధ్వర్యంలో పాపిరెడ్డి పార్టీలో చేరగా, పుట్ట మధూకర్‌ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కమాన్‌పూర్‌ మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ బాద్రపు మల్లేశ్‌, సింగిల్‌ విండో నూతన డైరెక్టర్లు పాల్గొన్నారు.logo