ఆదివారం 23 ఫిబ్రవరి 2020
గ్రామాల వికాసానికి పెద్దపీట

గ్రామాల వికాసానికి పెద్దపీట

Feb 15, 2020 , 00:51:24
PRINT
గ్రామాల వికాసానికి పెద్దపీట

రామగిరి: గ్రామాల వికాసానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సుందిళ్లలో గ్రామ పంచాయతీ ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు సర్పంచ్‌ దాసరి లక్ష్మితో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకునేందుకు సీఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీలకు పెద్దమొత్తంలో నిధులు వెచ్చించారని పేర్కొన్నారు.  ప్రభుత్వం చేపట్టిన తాగు, సాగునీరు, 24గంటల కరెంట్‌, రైతుబంధు, రైతుబీమా వంటివి గ్రామీణ ప్రజల జీవన ప్రమాణలు మెరుగుపడి ఆర్థిక పురోగాభివృద్ధి వైపు పయణిస్తున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో తమ గ్రామాల అభివృద్ధికి చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు ఆర్ల ప్రణిత, తాటి సారయ్య, కార్యదర్శి శ్రీనివాస్‌, వీఆర్వో చంద్రారెడ్డి, నాయకులు దాసరి రాయలింగు, కారె శంకర్‌, గర్రెపల్లి సదానందం తదితరులు పాల్గొన్నారు.logo