బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 15, 2020 , 00:50:11

నేడే సహకార పోరు

నేడే సహకార పోరు

మంథనిటౌన్‌: సహకార సంఘం ఎన్నికలు శనివారం జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మంథని సింగిల్‌ విండో పరిధిలో 13నియోజకవర్గాలుండగా ఇప్పటికే ఐదు నియోజకవర్గాలను టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకొంది. మిగిలిన 8 నియోజకవర్గాలకు అధికారులు ఎన్నికలను నిర్వహించనున్నారు. స్థానిక ప్రభు త్వ బాలుర జూనియర్‌ కళాశాలలో విండో ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

8 నియోజకవర్గాలకు ఎన్నికలు.. 

మంథని సింగిల్‌ విండో పరిధిలోని 13 నియోజకవర్గాలుండగా ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున బరిలో నిలిచిన అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 3వ నియోజకవర్గంలో మాచీడి రాజుగౌడ్‌, 6వ నియోజకవర్గంలో శ్రీమూర్తుల ఓదెలు, 8లో లెక్కల కిషన్‌రెడ్డి, 10లో కొత్త శ్రీనివాస్‌, 12లో ఉడుత మాధవి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. మిగిలిన 1,2,4,5,7,9,11,13వ నియోజకవర్గాల్లో అధికారులు ఎన్నికలను నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో మొత్తం 1539 మంది రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న సిబ్బంది 

సహకార సంఘం ఎన్నికల కోసం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. బ్యాలెట్‌ పేపర్లు, బాక్స్‌లతో పాటు ఇతర ఎన్నికల సామగ్రితో అధికారులు, సిబ్బంది కేంద్రానికి చేరుకున్నారు.  మొత్తం 24 మంది అధికారులు ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రొసిడింగ్‌ అధికారితోపాటు ఇద్దరు సహాయకులను ఉన్నతాధికారులను నిర్వహించారు. మంథని సింగిల్‌ విండో ఎన్నికల పరిశీలకులుగా చాట్ల ఆగయ్య వ్యవహరించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగనున్న ఈ ఎన్నికల్లో సభ్యత్వం కలిగివున్న రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు, వెనువెంటనే ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. 

కమాన్‌పూర్‌: కమాన్‌పూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికలకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. సహకార సంఘం పరిధిలో 13నియోజకవర్గాలు ఉండగా ఇందులో 5 ఏకగ్రీవమయ్యాయి. ఇక 1, 2,3,4,7,10,11,12 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. కాగా ఒక్కో నియోజకవర్గ స్థానానికి ముగ్గురి చొప్పున ఎన్నికల అధికారులను నియమించారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పోలింగ్‌ జరుగనుంది.   


logo
>>>>>>