బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 15, 2020 , 00:48:14

ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

కాల్వశ్రీరాంపూర్‌: ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులదే విజయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సహకార సంఘాలు అభివృద్ధి జరగుతాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. రైతుల కోసం అహర్నిషలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్‌కు అందరూ అండగా నిలవాలని కోరారు. కాల్వశ్రీరాంపూర్‌, కూనారం సహకార సంఘాలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలని చెప్పారు. రైతుల కోపం రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులంతా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కార్యకర్తలకు పరిచయం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొట్టె రవీందర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, సర్పంచులు కాసర్ల తిరుపతిరెడ్డి, బండ రవీందర్‌రెడ్డి, భైరం రమేశ్‌, గోనే శ్యాం, మల్లారెడ్డి, పుప్పాల నాగార్జునరావు, ఆకుల చిరంజీవి, ఎంపీటీసీలు, గడ్డం రాంచంద్రం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 ట్రాక్టర్‌ ప్రారంభం

ఓదెల: హరిపురం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి శుక్రవారం ట్రాక్టర్‌ షో రూం వద్ద గ్రామ సర్పంచ్‌కు అందజేశారు. అనంతరం ట్రాక్టర్‌కు పూజలు చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పల్లె ప్రగతిలో కార్యక్రమంలో గ్రామపంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్‌ను గ్రామపంచాయతీ పాలకవర్గం కొనుగోలు చేసింది. ట్రాక్టర్‌తో గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పాలనీ, హరితహారంలో నాటిన మొక్కలను ట్యాంకర్‌ ద్వారా నీటిని అందించి బతికించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుండేటి మధు పాల్గొన్నారు.  


logo