బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 15, 2020 , 00:47:20

వీరజవానులకు నివాళులు

వీరజవానులకు నివాళులు

మంథనిటౌన్‌: పుల్వామా దాడిలో అమరులైన భారత జవానులకు శుక్రవారం వివిధ సంఘాలు, పాఠశాలల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాతోపాటు పాఠశాల, కళాశాలల్లో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మౌనం పాటించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో యూత్‌ సభ్యులు, ఏబీవీపీ శ్రేణులు, నాయకులు మేడగోని వెంకటేష్‌, గుడి అశోక్‌, వీకే రవి, డిగంబర్‌, సతీశ్‌, శ్రీకాంత్‌, కన్నూరి అనిల్‌కుమార్‌, సందీప్‌, సాయి, రాకేశ్‌, మహేశ్‌, సుమంత్‌ పాల్గొన్నారు. కాగా గుంజపడుగు గ్రామంలో ఉన్న అన్నారం పంపుహౌస్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పుల్వామా దాడిలో అమరులైన జవాన్లను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ విజయ్‌కుమార్‌, ఏఎస్‌ఓలు చంద్రశేఖర్‌, కనుకయ్యతోపాటు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. 

కమాన్‌పూర్‌:  గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం దేశ చిత్రపటం నమూనాలో ఏర్పడి నివాళులర్పించారు. అనంతరం దేశ భక్తి గీతాలతో పాటు సైనికల పోరాటాలు, త్యాగాలకు సంబంధించిన గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్‌ పిడుగు సతీశ్‌, హెచ్‌ఎం నర్ముల గంగయ్య, ఉపాధ్యాయులు టీ మల్లయ్య, సుల్తాన, ఉమతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. మండలకేంద్రంలోని బస్టాండ్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐ శ్యామ్‌ పటేల్‌తో పాటు అన్నిరాజకీయ పార్టీల నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రామగిరి: బేగంపేట గ్రామంలో మహిళలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మంథని జేఎన్‌టీయూహెచ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు  శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి సెంటినరీకాలనీ వీధుల గుండా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కెట్‌ రోడ్డు, తెలంగాణ చౌరస్తా, పన్నూరు క్రాస్‌ రోడ్డు మీదుగా జీఎం కార్యాలయం వరకు జరిగింది. కార్యాలయం ఎదుట కొవ్వొత్తులు ఉంచి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మార్కండేయ, ఎస్‌ఐ మహేందర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి దుర్గారావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


logo
>>>>>>