ఆదివారం 24 మే 2020
Peddapalli - Feb 15, 2020 , 00:47:20

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో ఉపయోగం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో ఉపయోగం

ఓదెల: కిసాన్‌ క్రెడిట్‌  కార్డులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై మడక గ్రామంలోని రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డీఏఓ మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో బ్యాంక్‌లు ఈ సదుపాయాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. కిసాన్‌ క్రెడిట్‌ కా ర్డు తీసుకొని గడువు లోపల తీసుకున్న రుణాన్ని చెల్లిస్తే అధిక లాభాలను పొందవచ్చన్నారు. అలా గే పీఎం కిసాన్‌కు సంబంధించిన రైతులందరూ విధిగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పొందాలని కోరా రు. ఈ కార్డు కావాల్సిన రైతులు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ను లేదా బ్యాంక్‌ అధికారులను గాని సంప్రదించాలని తెలిపారు. అలాగే పట్టా పాసుబుక్కు ఉన్న రైతులందరూ క్రాప్‌లోన్‌ తీసుకున్న వారు గడువు లోపల వాటిని రెన్యూవల్‌ చేసుకుంటే వడ్డీ భారం తగ్గుతుందన్నారు. అనంతరం జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పంట వేసే రైతులకే కాకుండా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, చేపల పెంపకం చేస్తున్న రైతులకు కూడా మంచిగా ఉపయోగపడు తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మ్యాడగోని భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యు రాలు నోముల పద్మావతి, ఉపసర్పంచ్‌ నిరంజన్‌రెడ్డి, ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, ఏఈఓలు సతీశ్‌, సంధ్య, కిరణ్‌, స్వప్న, మౌనిక పాల్గొన్నారు. 


logo