సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Feb 15, 2020 , 00:44:37

ఎల్‌ఓసీ మంజూరు పత్రం అందజేత

ఎల్‌ఓసీ మంజూరు పత్రం అందజేత

జూలపల్లి : కరీంనగర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం వెంకట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి వైష్ణవి భర్త శ్రీనివాస్‌కు లక్ష విలువైన ఎల్‌ఓసీ మంజూరు పత్రం అందజేశారు. వైష్ణ వి కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడు తుంది. ఈ క్రమంలో మిత్రులు, గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. ఈ సందర్భం గా మంత్రికి ఆరెల్లి శ్రీనివాస్‌, తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ మనోజ్‌గౌడ్‌, వైష్ణవి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.  

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి  

ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. దొంగతుర్తి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య -మంగ కూతురు  కొడారి సంజన - కౌశిక్‌ నందన్‌ వివాహం కరీంనగర్‌లోని రేకుర్తి లోని ఓ ఫంక్షన్‌ హాలులో జరగ్గా  మంత్రి హాజరై ఆశీర్వదించారు. అనంతరం లంబాడీతండా (బి) గ్రామంలో మా జీ ఎంపీటీసీ నున్సావత్‌ పర్షానాయక్‌ కుమారుడు అనిల్‌ రిసెప్షన్‌కు మంత్రి హాజరై ఆశీర్వదించారు. అనంతరం ఎర్రగుంటపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ధర్మారానికి చెందిన వ్యాపారి జిడిగె కిషన్‌ మనుమడు బీరెల్లి అరవింద్‌ వివాహానికి ఈశ్వర్‌ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మంత్రి వెంట పలువురు టీఆర్‌ ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.


logo