శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 13, 2020 , 03:18:05

ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి

ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: పేదింటి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఉద్ఘాటించారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అంతర్గాం మండలానికి చెందిన 43 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులు, ఒకరికి ఎల్‌ఓసీ మంజూరుపత్రం, మరొకరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాటాడారు. ఆంధ్రా పాలకుల హయాంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూడ్చేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు ఇచ్చి వారు గౌరవంగా జీవించేలా పాటుపడుతున్నారనీ, నిరంతరం ప్రజాసంక్షేమానికి, పేదవారి అభ్యున్నతికి శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం ప్రజలు రుణపడి ఉండాలన్నారు. కార్యమ్రంలో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ,  వైస్‌ ఎంపీపీ మట్ట లక్ష్మి, రాజేశ్‌, మహేందర్‌రెడ్డి, సర్పంచులు బండారి ప్రవీణ్‌, సతీశ్‌, భాగ్యమ్మ, దివ్య, కార్పొరేటర్లు గట్టయ్య, మేకల సదానందం, తాసిల్దార్‌ బండి ప్రకాశ్‌, నాయకులు తిరుపతి నాయక్‌, కోల సంతోష్‌, తదితరులున్నారు.logo