సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 13, 2020 , 03:13:47

గులాబీ గూటికి పలువురు కాంగ్రెస్‌ నాయకులు

గులాబీ గూటికి పలువురు కాంగ్రెస్‌ నాయకులు

మంథనిటౌన్‌/కమాన్‌పూర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెం దుతున్నాయని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. మంథనిలోని ఆయన నివాసంలో కాం గ్రెస్‌కు చెందిన ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ మద్దెల దివాకర్‌, వార్డుమెంబర్లు నాంసాని సద య్య, బైరి రాజుతోపాటు దాదాపు 20మందికి, కమాన్‌పూర్‌లో సింగిల్‌విండో చైర్మన్‌ అభ్యర్థి ఇనగంటి భాస్కర్‌రావు నివాసంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి వేర్వేరుగా ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయాచోట్ల పుట్ట మధు మా ట్లాడుతూ, ఏళ్ల తరబడి పాలించిన కాంగ్రెస్‌ పాల కుల హయాంలోనే కాని ఎన్నో అభివృద్ధి పనుల ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం ఆరు సంవత్సరా ల్లో చేసి చూపించామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి  అభివృద్ధే ధ్యేయం గా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నా రు.  మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందని, మరికొన్ని రోజుల్లో ప్రతిపక్షం లేకుండా పోతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మి వస్తున్న వారందరికీ సందర్భోచితంగా స ముచిత స్థానం కల్పిస్తామని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషిచేయడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కా రానికి పాటుపడాలని సూచించారు. అనంతరం పార్టీలో చేరిన వారిని పుట్ట మధు శాలువాతో సన్మానించగా, పుట్ట మధును పార్టీలో చేరిన వారు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, టీఆర్‌ఎస్‌ మంథని, ముత్తారం మండలాధ్యక్షులు కొత్త శ్రీనివాస్‌, పోతుపెద్ది కిషన్‌రెడ్డిలతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా కమాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్‌ పిల్లి రాజు, నాయకులు పిల్లి శివలింగం, పిల్లి శంకర్‌, కొంతం మనోహర్‌, పిల్లి ఓదెలు, అనవేన లక్ష్మీరాజం, పిల్లి నర్సయ్య, పిట్టల రాములు, అనవేన మల్లయ్యలతో పాటు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇనగంటి జగదీశ్వర్‌రావు, కమాన్‌పూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ అభ్యర్థి ఇనగంటి భాస్కర్‌రావు, నాయకులు సత్యనారాయణ, రాచకొండ రవి, సాగంటి లక్ష్మణస్వామి పాల్గొన్నారు.    


logo